AP: పోలీసుల వేధింపులు తాళలేక యువకుడి ఆత్మహత్య

Published on Thu, 06/26/2025 - 11:04

సాక్షి, కృష్ణా జిల్లా: పోలీసుల వేధింపులు తాళలేక మండలంలోని పులిగడ్డకు చెందిన బొర్రా నాగశ్రీనివాస్‌ (26) పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల చర్యను నిరసిస్తూ మృతుడి బంధువులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ముందు ఆందోళన చేశారు.  మృతుడి బంధువుల కథనం మేరకు.. పులిగడ్డలో వారం రోజుల క్రితం జరిగిన ఓ కొట్లాట విషయమై నాగశ్రీనివాస్, అతని తండ్రి రాంబాబుపై కొంత మంది ఫిర్యాదు చేశారు.

ఈ విషయమై రాంబాబు, నాగశ్రీనివాస్‌ను ఎస్‌ఐ పలుసార్లు పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. మంగళవారం కూడా పోలీసులు ఫోన్‌ చేసి, కొట్లాట కేసును ఒప్పుకోవాలని, చెప్పినట్టు వినకపోతే రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తామని బెదిరించడంతో ఆందోళన చెందిన నాగశ్రీనివాస్‌ కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

కుటుంబ సభ్యులు అతడిని తొలుత అవనిగడ్డ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మచిలీపట్నంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స చేసిన వైద్యులు చేతులెత్తేయడంతో తిరిగి అవనిగడ్డ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయాడు. మృతుడికి భార్య, ఆరు నెలల పాప ఉన్నారు.

పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బంధువుల ఆందోళన 
ఎస్‌ఐ, పోలీసుల వేధింపుల వల్లనే నాగశ్రీనివాస్‌ ఆత్మహత్య చేసుకున్నాడని ఆగ్రహించిన బంధు వులు బుధవారం రాత్రి అవనిగడ్డ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో కొద్ది సేపు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే కోడూరు, నాగాయలంక ఎస్‌ఐలు చాణక్య, రాజేష్‌ వచ్చి ట్రాఫిక్‌కు ఇబ్బంది అవుతోందని చెప్పడంతో అక్కడ నుంచి పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. చల్లపల్లి సీఐ ఈశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని చర్చలు జరపడంతో మృతుడి బంధువులు ఆందో ళన విరమించారు. తన కుమారుడు మృతికి కారకులైన ఎస్‌ఐ, పోలీసులపై చర్యలు తీసుకోవాలని  మృతుడి తండ్రి రాంబాబు డిమాండ్‌ చేశారు.

 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)