Breaking News

ఓట్ల ప్రక్షాళనతో దొంగ వేషాలు! బాబు బాగోతం తెలిసి రామోజీ పాత పాట!

Published on Fri, 07/07/2023 - 04:36

సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితాకు సంబంధించి 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులు వెలుగులోకి వస్తుండటంతో టీడీపీ, అనుబంధ మీడియా రోజుకో రకంగా రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లుతోంది. ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం ద్వారా ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం నిశితంగా పరిశీలించడంతోపాటు ఆధార్‌కార్డును అనుసంధానిస్తుండటంతో ఎల్లో గ్యాంగ్‌ బెంబేలెత్తుతోంది.

దొంగే.. దొంగ దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఈనాడు, తోక పత్రిక 2019లో జరిగిన తప్పులను కప్పిపుచ్చేందుకు తంటాలు పడుతుండగా మర్నాడు అవే వార్తలను చదువుతూ టీడీపీ నేతలు విలేకరుల సమావేశాలను నిర్వహిస్తున్నారు.

కొన్ని పత్రికల్లో వెలువడ్డ కథనాల ప్రకారం ఓటర్ల జాబితాను పరిశీలించగా అవన్నీ 2019కి ముందునుంచే ఉన్నట్లు తేలిందని, ప్రత్యేక ఓటర్ల సవరణ ద్వారా తప్పులను సరి చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా ఇప్పటికే ప్రకటించినా ఎల్లో మీడియా విష ప్రచారం యథాప్రకారం కొనసాగుతోంది. 



ఇంటి నెంబరు లేకపోతే నేరమా? 
దేశంలో 18 ఏళ్ల వయసు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించే లక్ష్యంతో ఇంటి నెంబరు లేకపోయినా ఓటరుగా నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. పూరి గుడిసెల్లో నివసించే వారికి ఇంటి నెంబరు ఉండదు కాబట్టి ఇంటి నెంబరు అనే చోట సున్నా అని పేర్కొంటూ ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అదే ప్రకారం పార్వతీపురం మన్యం జిల్లాలో ఇంటి నెంబరు లేకుండా కొన్ని ఓట్లు ఎప్పటి నుంచో నమోదవుతున్నాయి.

ఇవన్నీ హఠాత్తుగా ఇప్పుడే జరిగినట్లు ‘సున్నా నెంబర్‌ ఇంట్లో 30 మంది ఓటర్లు’ అంటూ జూలై 1న ఈనాడు ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ఆధార్‌ కార్డులో ఇంటి నెంబరు లేనందున సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసినప్పుడు ‘సున్నా’ అని పొందుపరిచినట్లు అధికారులు వివరణ ఇచ్చినా రామోజీ పాతపాటే పాడారు.

ఈ ఓటర్లకు సంబంధించి 2019 జాబితాను పరిశీలించగా అప్పుడు కూడా ఇంటి నెంబర్‌ అనే చోట సున్నాగానే ఉండటం గమనార్హం. అధికారులు వివరణ ఇచ్చినా పట్టించుకోకపోవడం, ఓ కథనాన్ని ప్రచురించే ముందు కనీసం నిర్ధారించుకోకుండా విషం చిమ్మడం ద్వారా తన దుర్బుద్ధిని రామోజీ మరోసారి చాటుకున్నారు.

రేపల్లెలో ఎడాపెడా అంటూ..
రేపల్లెలో ఎడాపెడా దొంగఓట్లు అంటూ జూలై 1న ప్రచురించిన కథనాన్ని పరిశీలించగా అవన్నీ 2019లో కూడా ఉన్నట్లు వెల్లడైంది. అయితే అవన్నీ దొంగ ఓట్లు అని చెప్పలేమని, ఓటర్ల నమోదు సమయంలో చాలా మంది ఇంటి నెంబరు చెప్పలేనప్పుడు వీధి పేరు లేదా అపార్టుమెంట్‌ నెంబర్‌తో నమోదు చేయడం వల్ల ఒకే ఇంటిపై అధిక ఓట్లు ఉన్నట్లుగా కనిపిస్తోంది. వీటిని ప్రస్తుత ఓటర్ల సవరణ జాబితాలో పరిశీలించి దొంగ­ఓట్లు ఉంటే కచి్చతంగా తొలగిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా స్పష్టం చేశా­రు.  

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)