Breaking News

గుంటూరులో మహిళల ధర్నా

Published on Sun, 04/20/2025 - 20:28

సాక్షి, గుంటూరు: నగరంలోని మణి హోటల్ సెంటర్‌లో లక్కీ వైన్స్‌ను తొలగించాలంటూ మహిళలు, స్థానికులు ఆందోళనకు దిగారు. మద్యం షాపు దగ్గరకు వచ్చిన ఎక్సైజ్‌ సీఐ లతను మహిళలు నిలదీశారు. వైన్‌ షాపు కారణంగా మద్యం తాగి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని సీఐ లత దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. ధర్నా చేస్తున్న స్థానికులపై ఎక్సైజ్ సీఐ లత ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇక్కడ నుంచి మద్యం షాపును తొలగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రూల్స్ ప్రకారమే ఇక్కడ షాప్ కేటాయించామని సీఐ తెలిపారు. వైన్స్ దగ్గర తాగుబోతులు.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించకుండా సెక్యూరిటీ కల్పిస్తామంటూ సీఐ లత చెప్పుకొచ్చారు. దీంతో సీఐ లతపై మహిళలు ఆగ్రహించారు. దీంతో సీఐ, మహిళలకు మధ్య వాగ్వివాదం జరిగింది. ధర్నా చేస్తున్న స్థానికులతో  వైన్స్ యాజమాన్యం కూడా గొడవకు దిగింది.

ఇక్కడ నుంచి వైన్స్ తీసే ప్రసక్తే లేదంటూ మహిళలపై వైన్స్ యజమాని చిందులు తొక్కారు. ప్రభుత్వమే మాకు మద్యం అమ్ముకోమని లైసెన్స్ ఇచ్చిందని.. మీరేంటి చేసేదంటూ స్థానికులపై దౌర్జన్యానికి దిగారు. ఈ ఐదేళ్లపాటు మమ్మల్ని మీరేం చేయలేరంటూ ధర్నా చేస్తున్న వారిపై చిందులేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)