Breaking News

తాను అత్తారింటికి వెళ్లిపోతే అమ్మకు కష్టమని, బిడ్డ షాకింగ్‌ నిర్ణయం

Published on Wed, 10/30/2024 - 11:30

కాకినాడ క్రైం: కాకినాడలో తల్లీకుమార్తెల ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వన్‌ టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగన్నాథపురం పెంకేవారి వీధిలో శ్రీదుర్గానివాస్‌ పేరుతో జీప్లస్‌ వన్‌ భవనం ఉంది. దానిలోని కింద అంతస్తులో ఆకాశం సరస్వతి (60), ఆమె కుమార్తె స్వాతి (28) ఉంటున్నారు. సరస్వతి భర్త 16 ఏళ్ల క్రితం మృతి చెందాడు. వివాహిత అయిన పెద్ద కుమార్తె విశాఖపట్నంలో ఉంటోంది. 

చిన్న కుమార్తె స్వాతి టైలరింగ్‌ చేస్తూ సరస్వతిని పోషిస్తోంది. కాగా.. వీరి ఇంటి నుంచి మంగళవారం దుర్వాసన రావడంతో పైఅంతస్తులో ఉన్నవారు గమనించి ఇంటి యజమాని గుర్రాల శ్రీనివాస్‌కు చెప్పారు. ఆయన సమాచారంతో సీఐ నాగదుర్గారావు, బృందం అక్కడికి చేరుకొని తలుపులు బద్దలు కొట్టి చూస్తే లోపల సరస్వతి మంచంపై పడి చనిపోయి ఉంది. స్వాతి ఉరివేసుకుని కనిపించింది. వీరిద్దరూ కలిసి ఉరి వేసుకోగా, బరువుకు చీర తెగిపోయి సరస్వతి మంచంపై ఉండి ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహాలను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసినట్లు వన్‌ టౌన్‌ సీఐ, ఇన్వెస్టిగేటింగ్‌ ఆఫీసర్‌ నాగదుర్గారావు తెలిపారు.

తల్లికి అనారోగ్యం
సరస్వతి కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురైంది. స్వాతి ఆమెను కాకినాడ జీజీహెచ్‌లో చేర్చి వైద్యం చేయించింది. తల్లి ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తుండడంతో స్వాతి మనోవేదనకు గురయ్యేది. తాను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే తల్లి ఏమైపోతుందోనని బాధపడుతూ ఉండేది. ఈ కారణంతోనే తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. కాగా.. శనివారం రాత్రి 8 గంటల సమయంలో పొరుగున ఉన్న మహిళ దుస్తులను కుట్టించుకునేందుకు స్వాతి ఇంటికి వచ్చింది. ఆ సమయంలో తల్లీకుమార్తెలిద్దరూ నవ్వుతూనే మాట్లాడారు. ఆదివారం పాలు వేసే వ్యక్తి వచ్చి తలుపు తట్టినా తీయలేదు. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి దాటాక ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)