Breaking News

మాచర్లలో వీధి నాటకాలు!

Published on Tue, 05/28/2024 - 03:39

సాక్షి, నరసరావుపేట/మాచర్ల: వీధి గొడవలకు రాజకీయ రంగు పులిమి పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు బనాయించడమే లక్ష్యంగా టీడీపీ నేతలు రోజుకో డ్రామాకు తెర తీస్తున్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో పోలీసుల ద్వారా తాపీగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.

కారంపూడిలో ఘర్షణలు జరిగిన వారం తరువాత పిన్నెల్లి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడం తెలిసిందే. పాల్వాయి గేట్‌లో వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లపై దాడి చేసిన టీడీపీ ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావు ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేయగా తనను చంపుతానని పిన్నెల్లి బెదిరించారంటూ ఓ మహిళ ఫిర్యాదు చేశారంటూ ఇంకో కేసు పెట్టారు. ఇవి చాలవన్నట్లు కండ్లకుంటకు చెందిన టీడీపీ ఏజెంట్‌తో పిన్నెల్లి సోదరులపై మంగళగిరి పోలీసుస్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించారు.  

మద్యం మత్తులో దాడి.. 
మాచర్ల 22వ వార్డులో శనివారం రాత్రి మల్లె లీలావతి అనే మహిళపై అదే వీధికి చెందిన ఉప్పుతోళ్ల వెంకటేశ్‌ మద్యం మత్తులో దాడికి పాల్పడ్డాడు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరి మధ్య కొన్నాళ్లుగా కుటుంబ కలహాలున్నాయి. ఎల్లో మీడియా దీనికి రాజకీయ రంగు పులిమింది. బాధిత మహిళ టీడీపీకి ఓటు వేయడమే ఈ ఘర్షణకు కారణమంటూ కథనాలు అల్లేసింది. పిన్నెల్లి సోదరుల ప్రోద్బలంతో దాడులు జరిగినట్లు తప్పుడు కథనాలు వెలువరించింది.  

పార్టీలకు సంబంధం లేదు..  
నాపై జరిగిన దాడితో రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఓ పార్టీకి ఓటు వేయడంతో దాడి చేశారంటూ వచ్చిన కథనాల్లో నిజం లేదు. నన్ను ఏ మీడియా వాళ్లు వివరణ అడగలేదు. ఇష్టానుసారంగా వార్తలు రాయడం బాగాలేదు. మమ్మల్ని పార్టీల గొడవల్లోకి లాగొద్దు. మద్యం సేవించి నాపై దాడి చేస్తే పార్టీలకు అంటగట్టడం సరికాదు. నాపై దాడికి పాల్పడిన వెంకటేష్ పై పోలీసులు చర్య తీసుకోవాలి.   లీలావతి, బాధిత మహిళ, మాచర్ల

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)