Breaking News

ఫొటో తీస్తానని.. నదిలోకి నెట్టేసి..

Published on Sun, 07/13/2025 - 09:04

కృష్ణా: కొత్తగా పెళ్లయిన జంట.. బైక్‌పై వెళ్తూ మాంచి లొకేషన్‌ కనిపిస్తే ఫొటోలు తీసుకోవాలని ముచ్చటపడ్డారు. వారు వెళ్తున్న దారిలో కృష్ణానదిపై గుర్జాపూర్‌ బ్రిడ్జి వచి్చంది. అదే మంచి స్పాట్‌ అనుకొని ఫొటోలు దిగటానికి సిద్ధమయ్యారు. భర్త తన భార్యకు ఫోన్‌ ఇచ్చి.. తనను ఫొటోలు తీయాలని కోరి వెళ్లి బ్రిడ్జి అంచున నిలబడ్డాడు. భార్య కూడా ఫొటోలు తీస్తూనే భర్త వద్దకు వెళ్లి ఒక్కసారిగా అతన్ని నదిలోకి తోసేసింది. 

బిక్కచచ్చిపోయారు భర్త నీళ్లలో పడి కొట్టుకుపోతూ.. నదిలో ఓ రాయిని పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు. అతడి కేకలు విని జాలర్లు రక్షించి పైకి తీసుకొచ్చారు. అయితే, భార్యే తనను నదిలోకి తోసిందని భర్త చెబుతుండగా, లేదులేదు.. అతడే నదిలో పడిపోయాడని భార్య వాదిస్తోంది. ఏం చేయాలో తెలియని పోలీసులు తలలు పట్టుకున్నారు. ఈ ఘటన శనివారం తెలంగాణ– కర్ణాటక సరిహద్దులో నారాయణపేట జిల్లాలో ఉన్న గుర్జాపూర్‌ బ్రిడ్జిపై చోటుచేసుకుంది. 

ప్రమాదమా? హత్యాయత్నమా? 
కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లాలో ఉన్న శక్తినగర్‌కు చెందిన తాతప్ప (23)కు యాద్గిర్‌ జిల్లాలోని వడిగేరి గ్రామానికి చెందిన గెట్టెమ్మ (20)తో మూడు నెలల క్రితం వివాహమైంది. రెండు రోజుల క్రితం ఇద్దరు బైక్‌పై వడిగేరికి వెళ్లి శనివారం ఉదయం తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యలో కృష్ణానదిపై ఉన్న గుర్జాపూర్‌ బ్రిడ్జిపై ఫొటోలు దిగాలని భావించారు. భర్త తన ఫోన్‌ను భార్య చేతికి ఇచ్చి ఫొటో తీయమని చెప్పి ఆయన బ్రిడ్జి చివరన నిలబడ్డాడు. గెట్టెమ్మ ఫొటో తీస్తున్నట్లు నమ్మించి భర్తను నదిలోకి తోసేసింది. తర్వాత భర్త తల్లికి ఫోన్‌ చేసి తాతప్ప నదిలో పడిపోయాడని చెప్పింది. 

నదిలో పడిన తాతప్ప బ్రిడ్జి పక్కనే కొద్ది దూరంలో ఉన్న రాయిపైకి చేరి ‘నన్ను రక్షించండి.. నా భార్య పారిపోకుండా పట్టుకోండి’అంటూ కేకలు వేశాడు. దీంతో సమీపంలో చేపలు పడుతున్న జాలర్లు గమనించి తాతప్పను తాడు సహాయంతో ఒడ్డుకు చేర్చారు. పైకి వచి్చన తాతప్ప.. భార్యే తనను నదిలోకి తోసేసిందని ఆగ్రహం వ్యక్తంచేయగా.. భార్య మాత్రం తాను తోయలేదని, ఆయనే ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడని వాదించింది. ఈ విషయమై శక్తినగర్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ బస్వరాజ్‌ను వివరణ కోరగా ఘటన జరిగిన విషయం వాస్తవమేనని తెలిపారు. భార్యాభర్తల మధ్య పంచాయితీ ఉందని, వారి కుటుంబ సభ్యులు మాట్లాడుకొని ఆదివారం ఫిర్యాదు ఇస్తామని చెప్పారని వివరించారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)