Breaking News

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో వాట్సాప్‌ గవర్నెన్స్‌

Published on Thu, 01/30/2025 - 04:26

సాక్షి, అమరావతి: ప్రజలు నేరుగా ఫోన్‌ ద్వారానే ధృవపత్రాలు అందుకునేలా రాష్ట్ర ప్రభుత్వం గురువారం నుంచి వాట్సాప్‌ గవర్నెన్స్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఇందుకోసం గత ఏడాది అక్టోబర్‌ 22న మెటాతో ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం.. మొదటి విడతగా పౌరులకు 161 సేవలను వాట్సాప్‌ ద్వారా అందించనుంది. వాట్సాప్‌ గవర్నెన్స్‌పై బుధవారం సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో అధికారులు ఈ మేరకు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. వాట్సాప్‌ ద్వారా సేవలు ఎలా పొందాలి, ఆప్షన్‌లు ఎలా ఎంచుకోవాలో వివరించారు. 

మొదటి విడతలో దేవదాయ, ఎనర్జీ, ఏపీఎస్‌ ఆరీ్టసీ, రెవెన్యూ, అన్న క్యాంటీన్, సీఎంఆర్‌ఎఫ్, మున్సిపల్‌ వంటి వివిధ శాఖల సేవలు అందుబాటులోకి తెస్తున్నారు. రెండో విడతలో మరిన్ని సేవలను అందుబాటులోకి తేనున్నారు. దేశంలోనే మొదటిసారిగా వాట్సాప్‌ గవర్నెన్స్‌ను రాష్ట్రంలో ప్రవేశ పెడుతున్నామని, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు తిరగాల్సిన అవసరం ఉండదని చంద్రబాబు అన్నారు. అదేవిధంగా పౌరుల సమాచారం సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ఫోరెన్సిక్, సైబర్‌ సెక్యూరిటీని బలోపేతం చేయాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎస్‌ కె.విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)