Breaking News

డీఎస్సీ టీచర్లకు ‘వెబ్‌ ఆప్షన్స్‌’ ప్రారంభం

Published on Thu, 10/09/2025 - 05:46

సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 ద్వారా ఎంపికైన అభ్యర్థులు జిల్లాల్లో పాఠశాలలు ఎంపిక చే­సుకునేందుకు బుధవారం వెబ్‌ ఆప్షన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం వీరికి జరుగుతున్న శిక్షణ కేంద్రాల్లోనే విద్యాశాఖాధికారులు ఇందుకు ఏర్పాట్లుచేశారు. ఈనెల 10 వరకు ఇది జరుగుతుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో ఖాళీల వివరాలను ప్రకటించారు. 

కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 3, 4 కేటగిరీ పాఠశాలలకు సంబంధించిన ఖాళీలను మాత్రమే చూపినట్లు తెలిసింది. ఉపాధ్యాయుల్లేని ప్రాంతాలు, సింగిల్‌ టీచర్‌ పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న స్కూళ్లను కొత్త టీచర్లకు కేటాయిస్తున్నట్లు సమాచారం. అలాగే, జూన్‌లో జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో రిలీవర్‌ లేక అదే స్కూళ్లలో ఉండిపోయిన వారి స్థానాలను ఇక్కడ చూపడంలేదన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి.   

హైకోర్టు తీర్పునకు భిన్నంగా పోస్టుల భర్తీ.. 
ఇక డీఎస్సీ నిర్వహణ లోపభూయిష్టంగా ఉంద­ని, మెరిట్‌ లిస్టు ఇవ్వకుండానే నేరుగా అభ్య­ర్థులను ఎంపిక చేశారని కొందరు.. రిజర్వేషన్‌ ప్ర­క్రియ సక్రమంగా చేపట్టలేదని మరికొందరు, స్పోర్ట్స్‌ కోటా ఎంపికలోనూ అవకతవకలు జరి­గాయని ఇంకొందరు  అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అలాగే.. రెండు, మూడు పోస్టు­లు పొందిన వారికి తక్కువ కేటగిరీ పోస్టులు ఇవ్వడంపైనా హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కీలకమైన తీర్పును వెలవరించింది. 

ఉన్నతమైన పోస్టు పొందడం అభ్యర్థి హక్కు అని, వారికి ఆయా పోస్టులు ఇవ్వాలని తేల్చిచెప్పింది. ఫిర్యాదులకు సంబంధించిన పోస్టులను మినహాయించాలని కోర్టు తీర్పునిచ్చినట్లు అభ్యర్థులు చెబుతున్నారు. అయితే, అందిన ఫిర్యాదులను గ్రీవెన్స్‌ ద్వారా పరిష్కరించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. 

ఇందుకోసం జిల్లా, జోనల్, రాష్ట్రస్థాయిలో 60 రోజుల్లో పరిష్కరిస్తామని ప్రకటించింది. కానీ, ఈ సమస్యలు పరిష్కరించకుండానే మొత్తం అన్ని పోస్టులను భర్తీచేసేందుకు ఏర్పాట్లుచేసింది. మొత్తం 15,941 పోస్టులను నింపి ఈ నెల 13 నాటికి కొత్త టీచర్లు స్కూళ్లలో చేరాలని ఆదేశించిడం గమనార్హం.   

మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలి.. 
ఇదిలా ఉంటే.. కొత్త ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌ విధానంపై పూర్తి అవగాహన ఉండదని, వారికి మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఏపీటీఎఫ్‌ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్‌ విద్యాశాఖను డిమాండ్‌ చేశారు. బదిలీల్లో ఎస్జీటీలకు అనుసరించిన విధానాన్నే వీరికి కూడా అమలుచేయాలన్నారు. అలాగే, బదిలీ అయ్యి రిలీవ్‌ కాని ఉపాధ్యాయుల సమస్య పరిష్కరించేలా ఖాళీలు చూపించాలని విజ్ఞప్తి చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ కూడా మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. ఒక్క కర్నూలు జిల్లాలో ఒక్కో అభ్యర్థి 1,650 ఆప్షన్స్‌ ఇవ్వాల్సి ఉంటుందని, దీనివల్ల అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొంది.    

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)