Breaking News

మా ఫిర్యాదులపై చర్యలు తీసుకోరా?

Published on Mon, 12/09/2024 - 05:13

నెహ్రూనగర్‌ (గుంటూరు ఈస్ట్‌):  కూటమి ప్రభుత్వంలో చట్టం టీడీపీ వారికి ఒకలా, వైఎస్సార్‌సీపీ వారికి మరోలా అన్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులతో పాటు తనపై, తన కుటుంబ సభ్యులపై మంత్రి లోకేశ్, స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఇతర టీడీపీ నేతల ప్రోద్బలంతో ఆ పార్టీ శ్రేణులు సోషల్‌ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని, వాటిపై చర్యలు తీసుకోవాలని గత నెల పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. 

కేసు నమోదు చేయాలి.. 
‘బీఎన్‌ఎస్‌ఎస్‌ చట్టం ప్రకారం ఫిర్యాదు చేసిన 14 రోజుల్లో కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. అది తప్పుడు ఫిర్యాదు అయితే దానిని తప్పుడు ఫిర్యాదు అని ధ్రువీకరించాల్సి ఉంటుంది. కానీ, గుంటూరు పోలిసులు మా ఫిర్యాదులపై ఎలాంటి  కేసులు నమోదుచేయకుండా చట్టాన్ని ఉల్లంఘించారు. జిల్లా ఎస్పీని కలిసి కిందిస్థాయి పోలీస్‌ సిబ్బంది మా ఫిర్యాదులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. మీరైన చర్యలు తీసుకోవాలని కోరాం.

ఇక టీడీపీ నేతలు, కార్యకర్తలు ఫిర్యాదుచేస్తే దర్శకులు రాంగోపాల్‌వర్మ, పోసాని కృష్ణమురళిపై కేసులు నమోదు చేశారు.  సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌లపైనా కేసులు నమోదుచేసి వారిని జైళ్లల్లో కూడా పెట్టారు.  మాజీ మంత్రిని అయిన నేను స్వయంగా ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎందుకు పట్టించుకోవడంలేదు? దీనిపై కోర్టులను ఆశ్రయిస్తాం. పోలీసుల తీరును వ్యవస్థలు గమనించాలని శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యాం.

ఈ నిరసన స్థానిక పోలీసుస్టేషన్ల వద్దగాని, ఎస్పీ కార్యాలయం వద్దగాని, డీజీపీ కార్యాలయం వద్దగాని ఉంటుంది. పోలీసులు మా ఫిర్యాదులపై స్పందించకపోతే మా ముఖ్య నాయకులతో కలిసి ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుత నిరసన తెలియజేస్తాం. అలాగే, చట్టబద్ధంగా పోరాటం చేస్తాం’ అని అంబటి చెప్పారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ గుంటూరు జిల్లా అధ్యక్షులు సీడీ భగవాన్, పార్టీ రాష్ట్ర లీగల్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి పోలూరి వెంకటరెడ్డి తదితరులు     పాల్గొన్నారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)