Breaking News

మరో వివాదంలో ‘విశాఖ సెంట్రల్ జైలు’.. ఇద్దరు ఖైదీలు రాసిన లేఖ వైరల్

Published on Wed, 08/06/2025 - 20:28

సాక్షి, విశాఖపట్నం: మరోసారి విశాఖ సెంట్రల్ జైలు  వివాదంలో చిక్కుకుంది. ఇద్దరు ఖైదీలు రాసిన లేఖ వైరల్  అవుతోంది. విశాఖ సెంట్రల్ జైల్ అధికారులపై ఖైదీల తీవ్ర ఆరోపణలు చేశారు. జైలు సుపరింటెండెంట్ మహేశ్ బాబు, డిప్యూటీ సూపరింటెండెంట్ సాయి ప్రవీణ్  వేధిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఓ కిడ్నాప్ కేసులో నిందితుడైన ఉలవల రాజేశ్, మరో ఖైదీ మీర్జాఖాన్ మీడియాకి లేఖ రాశారు.

రౌడీషీటర్ ఉలవల రాజేశ్‌ లేఖలో సంచలన అంశాలు వెల్లడించాడు. రిమాండ్‌లో తాను మొబైల్స్ వినియోగించకపోయినా సరే తనపై కుట్ర పన్నారు అంటూ లేఖలో పేర్కొన్నాడు. ‘‘సెల్ ఫోన్ సిగ్నల్ వచ్చే బ్లాక్ వద్ద నన్ను బంధించి మొబైల్ వినియోగించినట్లు నాపై తప్పుడు సాక్షాలు సృష్టించారు. జైలు అధికారుల దాష్టీకాలపై 18-3-2025న కోర్టు వాయిదాకు వచ్చినపుడు జైలు అధికారులపై జడ్జికి ఫిర్యాదు చేశాను. జడ్జి దృష్టికి ఈ వ్యవహారాలను తీసుకు వెళ్తున్నానంటూ కక్ష కట్టి నన్ను వేధిస్తున్నారు’’ అంటూ లేఖలో పేర్కొన్నాడు.

‘‘తోటి ఖైదీల వలె కాకుండా నన్ను లాకప్ నుంచి అస్సలు బయటకు రాకుండా సూపరింటెండెంట్ లోపలే బంధిస్తున్నారు. అందరు ఖైదీల్లాగా ఉదయం నుంచి నన్ను బయటకు పంపడం లేదు. జడ్జికి ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుక్కోవాలని వేధిస్తున్నారు. లేకుంటే జైల్లో ఇలానే హింస తప్పదని  సూపరింటెండెంట్ బెదిరిస్తున్నారు. జైల్లో మాకు చట్టప్రకారం ఇవ్వాల్సిన ఆహారాన్ని కూడా ఇవ్వడం లేదు. జైలు క్యాంటీన్‌ల్లో అనేక అవకతవకలకు పాల్పడుతూ దోపిడీ చేస్తున్నారు. జరుగుతున్న అవకతవకలపై అధికారులను నిలదీస్తే, గంజాయి వాడుతున్నారని తప్పడు కేసులు పెటడతామంటూ నాగన్న అనే మరో ముద్దాయిని బెదిరిస్తున్నారు. జైల్లో మేము పడుతున్న బాధలను బయటకు తెలియాలనే ఈ లేఖ రాస్తున్నాం’’ అంటూ రాజేశ్‌, మీర్జాఖాన్ చెప్పుకొచ్చారు.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?