Breaking News

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగులకు వేధింపులు!

Published on Mon, 09/23/2024 - 10:07

సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగులకు వేధింపులు ప్రారంభమయ్యాయి. స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం.. ఉ​ద్యోగులను అనేక రకాలుగా వేధిస్తోంది. దాదాపు మూడు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించే కుట్ర జరుగుతోంది కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగులకు యాజమాన్యం నుంచి కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. ఉద్యోగుల అలవెన్స్‌లు, హెచ్‌ఆర్‌ఏను యాజమాన్యం తొలగించింది. అలాగే, దాదాపు 500 మంది ఉద్యోగులను నాగర్‌ నగర్‌ స్టీల్‌ ప్లాంట్‌కు తరలించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అంతేకాకుండా ప్రస్తుతం స్టీల్‌ ప్లాంట్‌లో పనిచేస్తున్న దాదాపు 3000 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను తొలగించేందుకు యాజమాన్యం కుట్రలు చేస్తోంది. మరోవైపు.. వీఆర్‌ఎస్‌ పేరుతో 2500 మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్టు కార్మికులు చెబుతున్నారు. యాజమాన్యం ప్రయత్నాలు అన్నీ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణలో భాగమేనని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.

ఇక, ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్ మూసివేత కారణంగా 455 మంది శాశ్వత, 2500 మంది కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నోరు మొదపకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి కార్మికులు సిద్ధమవుతున్నట్టు తెలిపారు.

ఇది కూడా చదవండి: టీడీపీ గూండాల ఆరాచకం.. వైఎస్సార్‌సీపీ మహిళా కార్యకర్తలపై దాడి

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)