Breaking News

విశాఖ డ్రగ్స్‌ కేసు:‘వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు రాయవద్దు’

Published on Fri, 03/22/2024 - 12:16

సాక్షి, విశాఖపట్నం: విశాఖ పోర్టులో భారీగా డ్రగ్స్‌ పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ సీపీ రవిశంకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటర్‌పోల్‌ సమాచారంతో సీబీఐ విశాఖకు వచ్చిందని చెప్పుకొచ్చారు. సీబీఐ పిలిస్తేనే పోలీసులు అక్కడికి వెళ్లినట్టు తెలిపారు.  ఇదే సమయంలో తమపై ఎలాంటి పొలిటికల్‌ ఒత్తిడిలేదని స్పష్టం చేశారు. 

కాగా, రవిశంకర్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘ఈ డ్రగ్స్‌ కేసు అంతా సీబీఐ పర్యవేక్షిస్తోంది. సీబీఐ నుంచి మాకు కాల్‌ వచ్చింది. వారు డాగ్‌ స్క్వాడ్‌ కావాలని మమ్మల్ని అడిగారు. తర్వాత డాగ్‌ స్క్వాడ్‌ వద్దని చెప్పారు. ‍కేవలం డాగ్‌ స్క్వాడ్‌ కోసమే స్థానిక పోలీసులు వెళ్లారు. సీబీఐ విన్నపం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లారు. విశాఖ పోర్టు మా పరిధిలో ఉండదు. మేము కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో పనిచేస్తున్నాం. విధి నిర్వహణలో మమ్మల్ని ఎవరూ ఒత్తిడి చేయలేరు. ఏపీ పోలీసులపై సీబీఐ ఎలాంటి ఆరోపణలు చేయలేదు. 

మా పరిధిలోలేని ప్రైవేటు పోర్టుకు కస్టమ్స్‌ అధికారులు పిలిస్తేనే వెళ్లాం. వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు రాయడం మంచిది కాదు. కావాలని ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి వదంతులు సృష్టిస్తున్నారువిశాఖ డ్రగ్స్‌ వ్యవహారాన్ని సీబీఐ చూస్తోంది. విశాఖ చాలా సేఫ్‌ సిటి. లోకల్‌ అధికారుల వల్ల లేటు అ‍య్యిందని చెప్పడం టెక్నికల్‌ టెర్మినాలజీ మాత్రమే. మేము (NDPS) ఎన్డీపీఎస్‌ యాక్ట్‌ సాయంతో డ్రగ్స్‌ నేరస్తులపై ఉక్కుపాదం మోపుతున్నాం. విశాఖను డ్రగ్స్‌ ఫ్రీ సిటీగా చేస్తున్నాం. గత ఐదేళ్ల కాలంలో డ్రగ్స్‌ను కట్టడి చేస్తున్నాం. గంజా స్మగ్లింగ్‌ను అడ్డుకున్నాం’ అని కామెంట్స్‌ చేశారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)