Breaking News

విజయవాడ: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం.. ఇద్దరు బలి

Published on Wed, 08/13/2025 - 15:21

సాక్షి, విజయవాడ: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరి నిండు ప్రాణాలు బలయ్యాయి. మ్యాన్‌ హోల్‌ కోసం తవ్విన గుంతలో పడి ఒకరు, చెట్టు మీదపడి మరొకరు మృతిచెందారు. మృతులను  టీవీ మధుసూదన్‌, మూర్తాజా గుర్తించారు.

గులాం మొహిద్దీన్ స్ట్రీట్‌లో మ్యాన్‌ హోల్‌ కోసం నగరపాలక సంస్థ అధికారులు భారీ గుంత తవ్వించారు. భారీ గోతుల వద్ద అధికారులు ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. గత రాత్రి కురిసిన వర్షానికి రోడ్లు చెరువుల్లా మారాయి. వీఎంసీ అధికారులు తవ్విన గోతిలో టీవీ మధుసూదన్‌ అనే వ్యక్తి మృతి చెందాడు. వీఎంసీ అధికారుల నిర్లక్ష్యంపై మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, వైఎస్సార్‌షీపీ నేత పోతిన మహేష్ మండిపడ్డారు.

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో నిన్న రాత్రి నుండి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి పలు గ్రామాలు జలమయమయ్యాయి వాగులు పొంగి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామ శివారులో వాగు పొంగి జూలకల్లు పిడుగురాళ్ల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామంలో రహదారిపై నుండి పారుతున్న వరద నీరు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

దాచేపల్లి పట్టణంలోని రజక కాలనీ, బొడ్రాయి సెంటర్ తో పాటు పలు కాలనీలు జలమయమయ్యాయి. కేసానుపల్లి గ్రామంలో వాగు  పొంగి పొర్లుతోంది. కారంపూడి దాచేపల్లి గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మాచవరం మండలం శ్రీరుక్మిణిపురం గ్రామం వద్ద పిల్లేరు  వాగు పొంగి పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. మాచవరం మండలం గాంధీనగర్ వద్ద వరద నీటితో వాగు పొంగి పొర్లడంతో మాచవరం పిడుగురాళ్ల గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Vijayawada: చెట్టు మీద పడి మరొకరు మృతి

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)