Breaking News

ఏం జరిగిందో..? విషం తాగి దంపతుల బలవన్మరణం

Published on Tue, 07/28/2026 - 07:38

విజయవాడ: చూడ ముచ్చటైన జంట.. అనురాగం.. ప్రేమ, ఆప్యాయతలతో సంతోషంగా సాగుతున్న సంసారం.. ఏడేళ్ల ఆ బంధానికి ఇద్దరు మగపిల్లల సంతానం.. అంతా బాగుందని అనుకున్న ఆ చిన్న కుటుంబంలో ఒక్కసారిగా పెను విషాదం చోటుచేసుకుంది. ఏం కష్టమొచ్చిందో.. ఏమో కానీ భార్యాభర్తలిద్దరూ విషం తాగి మృత్యువు ఒడికి చేరిపోయారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దేవీనగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన సోమవారం కలకలం సృష్టించింది. 

ఏం జరిగిందంటే.. 
దేవీనగర్‌ ప్రాంతానికి చెందిన తాడిశెట్టి బాజీ సైదులు(30), జలసూత్రం మానస(27)కు పెద్దల సమక్షంలో 2019లో వివాహమైంది. వీరికి సంజయ్‌(5), సంతోష్‌ (ఏడాదిన్నర) కుమారులు ఉన్నారు. సైదులు విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో అవుట్‌ సోర్సింగ్‌ విభాగంలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మానస ఇంటి వద్దే ఉంటూ టెట్‌ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ఆదివారం ఉదయం సైదులు తన పిల్లలిద్దరినీ ఇందిరా   నాయక్‌నగర్‌లోని తన సోదరుడు నాగుల్‌మీరా వద్ద దింపి పనులకు వెళ్లగా మానస వారి ఇంటి సమీపంలోని చర్చికి ఉదయం పది గంటలకు వెళ్లి మధ్యాహ్నం రెండు గంటల తిరిగి ఇంటికి వచ్చింది. 

సాయంత్రం ఐదు గంటల సమయంలో సైదులు తన మావయ్య వీరభద్రరావుకు ఫోను చేసి దంపతులిద్దరం విషం తాగేశామని.. ఆస్పత్రికి తీసుకువెళ్లమని చెప్పాడు. దీంతో అతను తన వియ్యంకుడు ఏడుకొండలు, సైదులు సోదరుడు నాగుల్‌మీరాకు ఫోను చేసి హూటాహూటిన వారి ఇంటికి వెళ్లి తలుపులు పగలకొట్టి అపస్మారక స్థితిలో పడి ఉన్న భార్యాభర్తలిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న భార్యాభర్తలిద్దరూ పరిస్థితి విషమించి సోమవారం మృతిచెందారు. దీంతో వారి ఇళ్లల్లో తీవ్ర విషాదం నెలకొంది. 

ఆన్‌లైన్‌లో ఆర్డరు పెట్టుకొని.. 
సైదులు, మానస ఎంతో అన్యోన్యంగా ఉంటారని, వారికి ఆర్థిక సమస్యలు కూడా ఏమీ లేవని వారి కుటుంబ సభ్యులు, బంధువులు చెబుతున్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలతో మాటామాటా పెరిగి క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని పోలీసులు, కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఆన్‌లైన్‌లో గడ్డిమందు, కూల్‌డ్రింక్‌ను ఆర్డర్‌ పెట్టుకొని డ్రింక్‌లో దానిని కలుపుకొని ఇద్దరూ తాగినట్లుగా తెలుస్తోంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామని త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని అజిత్‌సింగ్‌నగర్‌ సీఐ దాడి చంద్ర  శేఖర్‌ తెలిపారు.  

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)