Breaking News

ఎన్నారై భాస్కర్‌రెడ్డికి బెయిల్‌

Published on Sat, 11/29/2025 - 21:11

సాక్షి, విజయవాడ: సోషల్‌ మీడియా యాక్టివిస్టు, ఎన్‌ఆర్‌ఐ భాస్కర్ రెడ్డికి ఊరట లభించింది. అక్రమ కేసులో విజయవాడ కోర్టు శనివారం ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. భాస్కర్‌రెడ్డి ప్రస్తుతం ప్రస్తుతం నెల్లూరు జైలులో జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 

మాలపాటి భాస్కర్ రెడ్డి స్వగ్రామం కృష్ణాజిల్లా పెనమలూరు మండలంలోని చోడవరం. భాస్కర్ రెడ్డి లండన్‌లో సూపర్‌ మార్కెట్‌ నిర్వహిస్తున్నారు. అయితే, జగన్‌ అభిమాని అయిన భాస్కర్‌..  సోషల్‌ మీడియాలో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా పోస్టులు పెడుతుంటారు. దీంతో కూటమి ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టింది. 

భాస్కర్‌ రెడ్డిని టార్గెట్‌ చేసిన కూటమి సర్కార్‌.. కక్ష సాధింపు చర్యలకు అదను చూసింది. నవంబర్‌ ఒకటవ తేదీన తన తండ్రి మరణంతో భాస్కర్‌ రెడ్డి.. లండన్ నుంచి స్వగ్రామం చోడవరం చేరుకున్నారు. ఈ సమాచారం అందుకున్న టీడీపీ నేతలు ఆయనపై తప్పుడు ఫిర్యాదు చేశారు. దీంతో కేసులు నమోదు అయ్యాయి. 

ఈ క్రమంలో.. అనారోగ్యంతో ఉన్న భాస్కర్ రెడ్డి తన సోదరుడు ఓబుల్ రెడ్డితో కలిసి నవంబర్‌ 6వ తేదీన ఆస్పత్రికి వెళ్లాడు. ఆ సమాచారం అందుకున్న పోలీసులు వాళ్లిద్దరినీ అరెస్ట్‌ చేశారు. ఆపై తప్పుడు పోస్టులు చేశానని ఒప్పుకోవాలంటూ ఏకంగా కోర్టు ప్రాంగణంలోనే బెదిరింపులకు దిగారు. అంతేకాదు.. తనని తీవ్రంగా కొట్టారంటూ భాస్కర్‌రెడ్డి మీడియా ఎదుట వాపోయారు కూడా. ఇదిలా ఉంటే.. బెయిల్‌ సందర్భంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)