టీడీపీ మూకల దాష్టీకం

Published on Sun, 08/02/2026 - 05:15

తిరుపతి రూరల్‌: తిరుపతిలో అంబేడ్కరిస్టులు, దళితులపై టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. వారి చేతుల్లో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ చిత్రపటంతో కూడిన బ్యానర్‌ చూడగానే చెలరేగిపోయారు.   ‘‘మీరు ఏమైనా అంబేద్కర్‌కు పుట్టినోళ్లా..? బొమ్మ పట్టుకుని వస్తే వదిలేస్తామా..? అంటూ తిట్లదండకం అందుకున్నారు. బ్యానర్‌ను చించివేసి  ఇక్కడి నుంచి వెళ్లకుంటే మీ అందరి అంతు చూస్తాం’’ అంటూ హూంకరిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. వెంటాడి దొరికిన వారిని దొరికినట్టు పిడిగుద్దులు కురిపిస్తూ చితకబాదారు. కొందరిని గొంతు నులిమి చంపేందుకు యత్నించారు. మహిళలపైనా దాడికి పాల్పడ్డారు. దాడిలో గాయపడిన దళితులను స్థానికులు చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.  

అసలు ఏం జరిగిందంటే..  
తిరుపతి రూరల్‌ మండలం అవిలాల గ్రామ పంచా­యతీ పరిధిలోని సర్వే నంబరు 145లో ఉన్న మఠం భూము­లను కొందరు టీడీపీ నాయకులు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. పంచాయతీవాసుల దాహార్తిని తీర్చేం­దుకు గతంలో ఏర్పాటుచేసుకున్న బోరునూ ఆక్రమించారు. నీటి సరఫరా నిలిపివేయడంతో అవిలాల మాజీ సర్పంచ్‌ వెంకటరమణతోపాటు దళితవాడ వాసు­లు, అంబేడ్కరిస్టులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేశారు. అయినా ఆక్రమణదారులు పనులు ఆపకపోవడంతో శనివారం అంబేడ్కర్‌ ఫొటోతో కూడిన బ్యానర్‌ను ముద్రించుకుని బోరు వద్దకు దళితవాడ వాసులు చేరుకుని భూ ఆక్రమణదారుల నుంచి పంచాయతీ బోరును కాపాడాలని నినదించారు. 

అదే సమయానికి భూ ఆక్రమణకు పాల్పడిన వారంతా అక్కడకు చేరు­కుని దళితులపై రెచ్చిపోయారు. బూతుపంచాంగం లం­కించుకున్నారు. నోటికి వచ్చినట్టు బూతులు తిడుతూ ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. అంబేడ్కర్‌ చిత్రపటంతో కూడిన బ్యానర్‌ను చింపేసి పరుష పదజాలంతో దళిత జాతిని అవమానించేలా తిడుతూ దొరికిన వారిని దొరికినట్టు కొట్టారు. ప్రాణభయంతో కేకలు పెడుతూ మహిళలు పరుగులు తీయగా వెంటాడి కొట్టారు. ఇదంతా పోలీసుల కళ్ల ముందే జరిగినా వారు కిమ్మనలేదు. చోద్యం చూస్తుండిపోయారు.  

గాయపడిన వారికి రుయాలో చికిత్స 
టీడీపీ గూండాల దాడిలో గాయపడిన అవిలాల పంచాయతీ మాజీ సర్పంచ్‌ వెంకటరమణ, కౌసల్య, విజయనిర్మల, ప్రసాద్, యాదగిరిలను చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని వైఎస్సార్‌సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర్‌రెడ్డి పరామర్శించారు. దళితులపై దాడి హేయమైన చర్యలని మండిపడ్డారు. టీడీపీ గూండాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నేతలు డిమాండ్‌చేశారు. దాడికి పాల్పడిన వారిలో టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరులుగా చెప్పుకునే నవీన్‌ నాయుడు, సునీల్, శంకర్‌ యాదవ్, బాలసుబ్రమణ్యం నాయుడు, పృధ్వీ ఉన్నారని, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని బాధితులు డిమాండ్‌ చేశారు.   

Videos

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)