Breaking News

తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు..

Published on Wed, 12/31/2025 - 07:53

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంగళవారం తిరుమలలో స్వర్ణరథోత్సవం కన్నుల పండువగా సాగింది. ఉదయం 9 నుంచి 10.30 గంటల నడుమ శ్రీవారి రథరంగ డోలోత్సవాన్ని పురమాడ వీధుల్లో నేత్రపర్వంగా నిర్వహించారు. నేడు బధవారం వైకుంఠ ద్వాదశి కావడంతో ఉదయం శ్రీవారి పుష్కరిణిలో అర్చకులు సంప్రదాయబద్ధంగా చక్రస్నానం నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్కరిణి పరిసరాలు భక్తులతో నిండిపోయాయి.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా పరిమిత సంఖ్యలోనే వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పించామని టీటీడీ అధికారులు తెలిపారు. మొత్తం పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతాయని, ఇప్పటికే వైకుంఠ ద్వార దర్శన టికెట్లు కలిగిన భక్తులకు మాత్రమే రేపటి వరకు దర్శనం ఉంటుందని వెల్లడించారు. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనంలో భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.అలిపిరి మెట్ల మార్గం ద్వారా లక్కీడిప్‌లో టికెట్ పొందిన భక్తులు మెట్టు మెట్టుకు పూజలు చేస్తూ భక్తిశ్రద్ధలతో తిరుమలకు చేరుకుంటున్నారు. తిరుపతితో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనానికి భక్తులు కిటకిటలాడుతున్నారు.

వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తులు: 67,053

నిన్న తలనీలాలు సమర్పించిన భక్తులు: 16,301

వైకుంఠ ఏకాదశి హుండీ ఆదాయం: ₹2.25 కోట్లు

 
 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)