Breaking News

ఏపీ ప్రభుత్వంపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ప్రశంసలు

Published on Thu, 07/13/2023 - 15:35

సాక్షి, తిరుపతి: ఏపీ ప్రభుత్వంపై కేంద్ర రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రశంసలు కురిపించారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలు కేంద్ర నిధులు రాబట్టడంలో పనితీరు కనబరుస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు మేజర్‌ పోర్టులను అభివృద్ధి చేస్తోందని అన్నారు. దేశంలోనే విశాఖపట్నం మేజర్‌ పోర్టు అని, దాని అభివృద్ధి జరుగుతోందన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం ద్వారా ఏపీలో మరింత పారిశ్రామికాభివృద్ధి జరగనుందని తెలిపారు.

కాగా తిరుపతిలో రూ.2,900 కోట్ల జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ.. రూ. 500 కోట్లతో ఏపీ ప్రభుత్వం-నేషనల్‌ హైవే సంస్థ మధ్య ఎంవోయూ కుదిరిందని.. తిరుపతిలో ఇంటర్నేషనల్‌ సెంట్రల్‌ బస స్టేషన్‌ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్నేషనల్‌ ఆర్క్‌ టెక్‌ నిర్మాణం చేస్తామని అన్నారు. దేశంలో ఏడు గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారులు అభివృధ్ది చేస్తున్నామని చెప్పారు.

రూ. 500 కోట్లతో తిరుపతి బస్టాండ్ విస్తరణ చేయాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కోరామని స్థానిక ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. కపిల తీర్థం నుంచి అంజిమేడు రోడ్డు అభివృధ్ది చేయాలని కోరినట్లు తెలిపారు. తడ శ్రీకాళహస్తి మధ్య స్టేట్ హైవేను జాతీయ రహదారిగా మార్చాలని, తిరుపతి - తిరుత్తణి-చెన్నై జాతీయ రహదారిను సిక్స్ లైన్ జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలని  కోరినట్లు వెల్లడించారు.
చదవండి: దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్టీసీలో అత్యధిక పెన్షన్‌ విధానం

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)