Breaking News

ఓం భీమ్‌ తుస్‌.. గురజాడ నామస్మరణ.. ఏపీ విస్మరణ

Published on Sun, 02/02/2025 - 04:07

సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఈసారి కేంద్ర బడ్జెట్‌ నుంచి రాష్ట్రానికి ప్రత్యేకంగా ప్రాజెక్టులు, కేటాయింపులు చేయించుకోవడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. శనివారం ప్రవేశపెట్టిన 2025–26 కేంద్ర బడ్జెట్‌లో తెలుగు కవి గురజాడ అప్పారావు రచించిన ‘దేశమంటే మట్టికాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌’ అన్న పద్యం తప్ప ఏపీకి సంబంధించి ఒక్క ప్రకటనా వినిపించలేదు. గత బడ్జెట్‌ తరహాలోనే ఈసారి బడ్జెట్‌లో కూడా బిహార్‌ రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌లో నిధుల వర్షం కురిపించారు. 

గత బడ్జెట్‌లో అమరావతి కోసం ప్రపంచ బ్యాంకు, ఏసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు నుంచి రూ.15,000 కోట్ల అప్పులు సాధించడం తప్ప.. ఈసారి బడ్జెట్‌లోనూ కూటమి పెద్దలు కొత్తగా కేటాయింపులు చేయించుకోలేకపోయారు. రాష్ట్రానికి ప్రత్యేక సాయం అందించాల్సిందిగా చంద్ర­బాబు ఇటీవల డిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి కోరారు. గోదావరి– బనకచర్ల ద్వారా నదుల అనుసంధానం ప్రాజెక్టుకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి నదుల అనుసంధాన లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు ఉందని చెప్పగా, కేంద్ర ఆర్థిక మంత్రి సానుకూలంగా స్పందించారని సీఎం చంద్రబాబు తెలిపారు. 

అయితే గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు గురించి గానీ, ప్రత్యేక సాయం గురించి గానీ నిర్మలా సీతారామన్‌ ప్రస్తావనే చేయలేదు. గతంలో పోలవరానికి ఇస్తామని అంగీకరించిన నిధులనే ఈసారి బడ్జెట్‌లో పేర్కొన్నారు తప్ప కొత్తగా ఎటువంటి కేటాయింపులు చేయలేదు. పైగా రాష్ట్ర విభజనకు సంబంధించిన అనేక ప్రాజెక్టులకు కేటాయింపులు చేయించడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విఫలం చెందింది.

ఏ మేలూ లేని బడ్జెట్‌పై పొగడ్తలా?
అమరావతి రాజధానికి అప్పులే తప్ప కేంద్రం నుంచి ఎటువంటి గ్రాంట్లు, ప్రత్యేక సాయాన్ని తెచ్చుకోలేకపోయింది. పైగా గత బడ్జెట్‌లో రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు సాయం గురించి మాట మాత్రంగానైనా చెప్పారు. ఈసారి బడ్జెట్‌లో అసలు వెనుకబడిన జిల్లాలకు సాయం గురించి గానీ, కేటాయింపుల గురించి గానీ పట్టించుకోలేదు. విభజన చట్టంలో ఉన్న గిరిజన, సెంట్రల్‌ యూనివర్సిటీలకు ప్రత్యేకంగా కేటాయింపులు చేయకుండా దేశం మొత్తం కేటాయింపుల్లో కలిపి చూపడం గమనార్హం. పెట్రోలియం యూనివర్సిటీ గురించి బడ్జెట్‌లో ప్రస్తావనే లేదు. 

గత బడ్జెట్‌లో రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలకు కట్టుబడి ఉన్నామంటూ ముక్తాయింపు ఇచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి.. ఈసారి బడ్జెట్‌లో అసలు దాని గురించి ప్రస్తావనే చేయలేదు. బీహార్‌కు పలు ప్రాజెక్టులను ప్రకటిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌కు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును కొత్తగా ప్రకటించక పోవడం, విభజన చట్టంలోని అంశాలకు కూడా కేటాయింపులు చేయక పోవడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే విదేశీ సాయంతో కొనసాగుతున్న విద్య, వైద్య, జీవనోపాధి ప్రాజెక్టులకు కేటాయింపులు చూపెట్టారు తప్ప కొత్తగా ఎటువంటి ప్రాజెక్టులను రాష్ట్రానికి మంజూరు చేయలేదు. 

కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఈ ఆర్థిక ఏడాది కన్నా వచ్చే ఆర్థిక ఏడాది పెరగనున్నట్లు కేంద్ర బడ్జెట్‌ అంచనాల్లో పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక ఏడాది సవరించిన అంచనాల మేరకు కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రూ.52,080 కోట్లు రానున్నట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అది రూ.57,566 కోట్లుగా పేర్కొన్నారు. ఏ రీతినా చూసినా రాష్ట్రానికి పెద్దగా మేలు చేయని ఈ బడ్జెట్‌పై సీఎం చంద్రబాబు పొగడ్తల వర్షం కురిపించడం విస్తుగొలుపుతోంది.  

గురజాడ మాట తప్ప..ఏపీ ప్రస్తావనేది?
‘తెలుగు మహాకవి, నాటక రచయిత గురజాడ అప్పారావు.. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్‌.. అని అన్నారు. దేశం అంటే దాని నేల మాత్రమే కాదని, అందులో ఉన్న ప్రజలని అర్థం. అందుకు అనుగుణంగా వికసిత్‌ భారత్‌ ఈ లక్ష్యాన్ని కలిగి ఉంటుంది’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొనడం మినహా తెలుగు రాష్ట్రమైన ఏపీకి ఒక్క ప్రాజెక్టూ ప్రక­టించలేదు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతికి అదనపు సాయం మాటే లేదు. 

గత ఏడాది జూలై 23న ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ ప్రసంగంలో ‘ఆంధ్ర­ప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని అంశాలను పరిష్కరించేందుకు కేంద్రం కృషి చేస్తోంది. వివిధ సంస్థల ద్వారా అమరా­వతికి ప్రత్యేక ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తాం. అందులో భాగంగా 2024–25లో రూ.15 వేల కోట్లు, తర్వాతి సంవత్సరాల్లో అదనపు మొత్తాలను అంద­జేస్తాం’ అని చెప్పారు. అయితే అందుకు కొనసాగింపుగా ఈ బడ్జె­ట్‌లో నిధుల అంశాన్ని ప్రస్తావించలేదు. 

విశాఖ­పట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని కొప్పర్తి నోడ్‌లో, హైదరాబాద్‌–బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌లోని ఓర్వకల్‌ నోడ్‌లో నీరు, విద్యుత్, రైల్వేలు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలకు నిధుల మంజూరు గురించి ఒక్కమాట చెప్పలేదు. ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న నితీశ్‌­కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ ప్రభుత్వం అధికా­రంలో ఉన్న బిహార్‌కు మాత్రం భారీ కేటాయింపులు చేసింది. జల్‌ జీవన్‌ మిషన్‌ కింద  ప్రత్యేకంగా ఏపీకి ప్రత్యేక నిధుల ప్రస్తావన లేదు.  

ప్రజల అనుకూల, ప్రగతిశీల బడ్జెట్‌
ప్రధాని మోదీ సారథ్యంలో ప్రజల అనుకూల, ప్రగతిశీల బడ్జెట్‌ను సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు.  మోదీ సారథ్యంలోని వికసిత్‌ భారత్‌ దార్శ­ని­కతను కేంద్ర బడ్జెట్‌ ప్రతిబింబిస్తోంది.  ఇది మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుంది. మధ్య తరగతి ప్రజలకు పన్ను మినహాయింపునిస్తూ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ను స్వాగతిస్తున్నా.
    – ఎన్‌. చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి
    
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సహకరిస్తుంది
కేంద్ర బడ్జెట్‌ ఆంధ్రప్రదేశ్‌ సమ­గ్రాభివృద్ధికి సహకారం అందించేలా ఉంది. పోలవరం ప్రాజెక్టు వ్యయ సవరణకు ఆమోదం తెలపడం, రూ.5,936 కోట్లు కేటాయించడం, బ్యాలెన్స్‌ గ్రాంట్‌ రూ. 12,157 కోట్లుగా ప్రకటించడం ద్వారా ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జరుగుతుంది. జల్‌ జీవన్‌ మిషన్‌ కార్యక్రమం  ద్వారా ప్రతి ఇంటికి మంచి నీరందుతుంది. గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు కేటాయించడం ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ఆస్కారం ఉంది.             
– కె.పవన్‌ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి

బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ పేరే లేదు 
2025–26 కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ పేరే లేదు. బిహార్, ఆంధ్రప్రదేశ్‌ వల్లే కేంద్రంలో ఎన్‌డీఏ కూటమి అధికారంలో నిలబడగలుగుతోంది. బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ తన రాష్ట్రానికి భారీగా నిధులు తెచ్చుకొంటే.. ఏపీ సీఎం చంద్ర­బాబు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఇది చంద్రబాబు చేతకానితనానికి నిదర్శనం. బిహార్‌ ముఖ్యమంత్రిని చూసి చంద్రబాబు చాలా నేర్చుకోవాలి. రాష్ట్రానికి కేంద్రం గతంలో ఇచి్చన హామీలు, బడ్జెట్‌లో చేసిన అన్యాయంపై పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ తరఫున పోరాటం చేస్తాం. 
    – పీవీ మిథున్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత

కూటమి చేతకానితనం వల్లే అన్యాయం
బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటు. ఓ పక్క బిహార్‌కు కేంద్రం అనే కానేక వరాలు ప్రకటిస్తే.. ఏపీకి చంద్రబాబు ఒక్క వరమూ పొందలేకపోయారు. ఇది ముమ్మాటికీ సీఎం చంద్రబాబు, కూటమి ఎంపీల చేతకాని తనమే. ఏపీకి కేంద్రం ఎప్పుడో ప్రకటించిన వాటిని అడ్డుపెట్టుకుని కూటమి నేతలు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. 
    – మద్దిల గురుమూర్తి, తిరుపతి ఎంపీ  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)