Breaking News

అంతర్‌ జిల్లా క్రీడా సర్టిఫికెట్‌తో టీచర్‌ పోస్టా?

Published on Mon, 06/01/2026 - 05:13

సాక్షి, అమరావతి: డీఎస్సీ నియామక ప్రక్రియపై రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు మండిపడుతున్నారు. ముఖ్యంగా క్రీడా కోటాలో రాత పరీక్ష అవసరం లేకుండా భర్తీ చేసిన టీచర్‌ పోస్టుల్లో భారీ అవినీతి చోటు చేసుకుందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అ­­త్యంత దారుణంగా ఇంటర్‌ డిస్ట్రిక్ట్ (అంతర్‌ జి­ల్లా) క్రీడా పోటీల సర్టీ ఫికెట్లతో ఉపాధ్యాయ పోస్టులు కట్టబెట్టేయడం విస్తుగొల్పుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు మొండిచెయ్యి చూపించి కేవలం ఒక జిల్లాకు క్రీడల్లో ప్రా­తినిథ్యం వహించిన వారి సర్టీ ఫికెట్లకు ప్రాధాన్యం ఇవ్వడం డీఎస్సీ క్రీడా కోటా పోస్టుల భర్తీలో పారదర్శకతకు పాతరగా నిలుస్తోంది. ‘ముఖ్య’నేత బంధువు, మాస్టర్‌ మైండ్‌ అవినీతి వ్యూహంలో భాగంగానే పోస్టుల భర్తీలో ప్రాధాన్యతలు మారిపోయినట్లు అభ్యర్థులు పేర్కొంటున్నారు. 

మెరిట్‌ జాబితా ఎక్కడ? 
క్రీడా కోటా డీఎస్సీలో 421 పోస్టుల్లో 97 శాతం భర్తీ చేశారు. అయితే ఎక్కడా మెరిట్‌ జాబితాను ప్రదర్శించలేదు. తొలుత టెంటేటివ్‌ (తాత్కాలిక) జాబితాను పెట్టిన శాప్‌ దానిపై అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు కోర్టులను ఆశ్రయిస్తుండటంతో వెంటనే తొలగించింది. ఆ తర్వాత తుది జాబితాను ఎక్కడా ప్రదర్శించకుండా కొందరు అభ్యర్థులకు వ్యక్తిగతంగా సమాచారం చేరవేసింది. విచిత్రం ఏమిటంటే.. తాత్కాలిక జాబితాలో ఉన్న చాలా మంది అభ్యర్థుల పేర్లు తుది జాబితాలో లేకపోవడం.

అంతా పారదర్శకంగా చేశామని, పబ్లిక్‌ డొమైన్‌లో ప్రతి డేటాను అందుబాటులో ఉంచామని శాప్‌ చైర్మన్‌ రవినాయుడు ప్రకటించారు. అయితే శాప్‌ వెబ్‌సైట్‌ మొత్తం జల్లెడ పట్టినా ఎక్కడా ఎంపికైన ఒక్క అభ్యర్థి వివరాలు కానరాలేదు. శాప్‌కు వచి్చన దరఖాస్తులను తొలుత స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలించి జాబితాను రాష్ట్ర స్థాయి కమిటీకి పంపగా సమీక్షించి తుది జాబితాను ఆమో­దించింది. ఇదంతా లోపాయికారిగా చేయడంలో మాస్టర్‌మైండ్‌ కీలక చక్రం తిప్పినట్టు తెలుస్తోంది! 

బ్యాక్‌గ్రౌండ్‌ జల్లెడ పడుతున్న అభ్యర్థులు.. 
క్రీడా కోటా డీఎస్సీలో అవినీతి బాగోతాన్ని కప్పిపుచ్చేందుకు ‘మాస్టర్‌మైండ్‌’ ఉద్యోగాలు పొందిన కొందరు ఉపాధ్యాయులను రంగంలోకి దించి వీడియోలతో ప్రజల దృష్టిని దారి మళ్లించేందుకు చేసిన యత్నం బెడిసికొడుతోంది. వారి బ్యాక్‌ గ్రౌండ్‌ను నిరుద్యోగ అభ్యర్థులు జల్లెడ పడుతున్నారు. అన్ని అర్హతలు ఉండి కూడా ఉద్యోగం దక్కని క్రీడాకారులు దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీంతో వీడియోలు చేస్తే తమ గుట్టు రట్టవుతుందని ఫేక్‌  సర్టీ ఫికెట్లతో ఉద్యోగం పొందిన వారు బెంబేలెత్తుతున్నారు. ఇదిలా ఉంటే డీఎస్సీ గురించి చిన్న పేపర్‌ కూడా బయటకు వెళ్లడానికి వీల్లేదంటూ తమపై మాస్టర్‌మైండ్‌ విరుచుకుపడటాన్ని శాప్‌ వర్గాలు జీరి్ణంచుకోలేకపోతున్నాయి. మూటలు దోచుకుని తమపై చిందులేయడం ఏమిటని చర్చించుకుంటున్నాయి. 

సర్టీ ఫికెట్ల పరిశీలన ఏది? 
పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ క్రీడాకారిణి ఖోఖోలో జాతీయ స్థాయిలో రాణించారు. ఆమెకు డిగ్రీ సర్టీ ఫికెట్‌ లేకున్నా స్పోర్ట్స్‌ కోటా డీఎస్సీలో ఉద్యోగం వచ్చింది. తొలుత జిల్లా జాబితాలో 10వ స్థానంలో ఉన్న ఆమె తర్వాత టాప్‌లోకి వచ్చేసింది. పొరుగు రాష్ట్రంలో డిగ్రీ చదివినట్లు ఓ ఫేక్‌ సర్టీ ఫికెట్‌ను సృష్టించి పోస్టు అమ్మేశారు. 

అదే శాప్‌.. క్రీడా సర్టీ ఫికెట్‌తోపాటు అభ్యర్థి డిగ్రీ సర్టీ ఫికెట్‌ నిజమైనదేనా? అని పరిశీలించి ఉంటే అక్రమాలు జరిగేవి కావని అవకాశం కోల్పోయిన అర్హులైన అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో బీపీఈడీ, బీఈడీలు చేసినట్లు బోగస్‌ సర్టీ ఫికెట్లతో ఉద్యోగాలిచ్చారని, ఒక్క అభ్యర్థి విషయంలో కూడా శాప్‌ ఆయా వర్సి­టీలకు వివరాలను పంపించి వాస్తవాన్ని ధ్రువీకరించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రీడా సర్టీ ఫికెట్లే కాదు.. దొంగ డిగ్రీలతోనూ టీచర్‌ ఉద్యోగాలు అమ్మేయడం ‘మాస్టర్‌మైండ్‌’ స్కెచ్‌కు నిదర్శనమని పేర్కొంటున్నారు.

సర్టిఫికెట్‌కు రూ.5 లక్షలు.. పోస్టుకు రూ.15–20 లక్షలు!
క్రీడా కోటా డీఎస్సీలో ఫేక్‌ సర్టిఫికెట్లు సృష్టించి టీచర్‌ ఉద్యోగాలను అంగట్లో సరుకుల మాదిరి­గా అమ్మేశారని తొలి నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.5 లక్షలకు ఇంటర్‌ డిస్ట్రిక్ట్ సర్టి­ఫికెట్లను విక్రయించడంతో పాటు పోస్టుకు రూ.­15–20 లక్షలు చొప్పున వసూలు చేసినట్లు అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఇలా మూడొంతులు పోస్టులు అమ్ముకుని రూ.40–50 కోట్లు వసూలు చేసినట్లు క్రీడాకారులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అందుకే ఎక్కడా తుది మెరిట్‌ లిస్టును ప్రదర్శించ లేదని.. దొడ్డి దారిన ఉద్యోగాలు పొందిన వారి గుట్టు, మాస్టర్‌మైండ్‌ బండారం బయటపడుతుందనే భయంతోనే దాన్ని దాచేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)