Breaking News

ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం.. ఏపీవాసులు మృతి

Published on Fri, 09/18/2026 - 05:12

సాక్షి, విశాఖ: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నా­నికి చెందిన ఇద్దరు మహిళలు దుర్మరణం పాల­య్యారు. బుధవారం (సెప్టెంబర్‌ 16) రాత్రి జరి­గిన ఈ ప్రమాదంలో విశాఖ జిల్లా క్రికెట్‌ సంఘం (వీడీసీఏ) మాజీ సంయుక్త కార్యదర్శి జి.టి.­ప్రసాద్‌ భార్య రమాదేవి (67), కోడలు నేహా బొమ్మలి (33) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పో­యారు. ఈ ఘటన ప్రసాద్‌ కుటుంబంతో పాటు విశాఖ నగరంలో తీవ్ర విషాదం నింపింది. 

విశాఖ­లోని సీతమ్మధారలో నివాసముంటున్న జి.టి.­ప్రసాద్‌ గతంలో షిప్‌యార్డ్‌ ఉద్యోగిగా, 2017 వరకు వీడీసీఏ ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో జాయింట్‌ సెక్రటరీగా పనిచేశారు. ఆయన కుమారుడు, కోడ­లు మెల్‌బోర్న్‌లో స్థిరపడ్డారు. కుమారుడి కుటుంబాన్ని చూడటంతో పాటు అక్కడ జరిగే ఒక శుభ­కా­ర్యంలో పాల్గొనేందుకు ప్రసాద్, రమాదేవి దంపతులు ఇటీవల ఆస్ట్రేలి­యా వెళ్లారు. 

బుధవారం రాత్రి 9:40 గంటల సమ­యంలో మెల్‌బోర్న్‌ నైరుతి శివారు పాయింట్‌ కుక్‌లోని బోర్డ్‌వాక్‌ బౌలేవార్డ్, ఇన్నిస్‌ఫైల్‌ డ్రైవ్‌ జంక్షన్‌ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమాదేవి, నేహా అక్క­­డికక్కడే మృతిచెందారు. కారు డ్రైవర్‌కు గాయా­లయ్యాయి. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ స్వల్పంగా గాయప­డ్డాడు. అతడిని పోలీ­సులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

పదిరోజుల్లో విశాఖకు మృతదేహాలు 
వరుణ్‌చంద్ర గున్నా, నేహా దంపతులకు మూడు­న్న­రేళ్ల కుమారుడు హారవ్, ఏడాది వయసున్న కుమార్తె వివాన్వి ఉన్నారు. ఇటీవలే వివాన్వి మొ­దటి పుట్టినరోజు వేడుకలను కుటుంబ­సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఎంతో వేడుకగా నిర్వహించారు. రమాదేవి, నేహా మృతదేహాలు విశాఖ చేరు­కోవడానికి కనీసం 10 రోజుల సమ­యం పట్టే అవకాశం ఉందని కుటుంబసభ్యులు తెలి­పారు. ఇందుకు అవసరమైన ప్రక్రియ పూర్తి­చేసి, బాధితులకు అండగా నిలిచేందుకు అక్కడి ఆస్ట్రేలియన్‌ తెలుగు కమ్యూనిటీ నిధులు సేకరిస్తోంది. ఈ ప్రమాదంలో రమాదేవి, నేహా మృతి చెందడంపై వీడీసీఏ ప్రతినిధులు, విశాఖ క్రీడాకారులు తీవ్ర సంతాపం తెలిపారు.  

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)