Breaking News

తుని ఘటన: నారాయణరావు మృతదేహం లభ్యం

Published on Thu, 10/23/2025 - 07:45

సాక్షి,  కాకినాడ:  బాలికపై అత్యాచారయత్నం కేసు నిందితుడు, టీడీపీ నేత తాటిక నారాయణరావు(62) మృతదేహాం లభ్యమైంది. బుధవారం అర్ధరాత్రి మెజిస్ట్రేట్‌ ముందుకు హాజరుపర్చడానికి తీసుకెళ్తున్న సమయంలో.. తుని కోమటిచెరువులో దూకేశాడు. గురువారం ఉదయం గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు.

నారాయణరావును నిన్న సాయంత్రమే పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఘటన తీవ్ర చర్చనీయాంశమైన తరుణంలో.. అర్ధరాత్రి పూట రహస్యంగా నిందితుడిని మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరిచేందుకు తీసుకెళ్లబోయారు. వాష్‌రూమ్‌కు వెళ్తామంటే వాహనం ఆపామని, ఆ సమయంలో నిందితుడు నారాయణరావు చెరువులో దూకేశాడని పోలీసులు చెబుతున్నారు. నారాయణరావు పారిపోవాలని చూశాడా?.. ఆత్మహత్యయత్నం చేశాడా? అనేది స్పష్టత లేకుండా పోయింది.

కాకినాడ జిల్లా తుని మండలం ఎస్‌.అన్నవరం శివారులో జరిగిన దారుణ ఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. అధికార టీడీపీ పార్టీకి చెందిన ఓ నేత.. మైనర​ బాలికపై అఘాయిత్యానికి ప్రయత్నించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

జగన్నాథగిరిలోని ఏపీ గురుకుల బాలికల పాఠశాలలో బాలిక(13)కు  చదువుకుంటోంది. తండ్రి లేకపోవడంతో తల్లే సెలవులప్పుడు వచ్చి చూసి పోతుంటుంది. అయితే ఆమె తన మనవరాలని, ఇంజెక్షన్‌ వేయిస్తానంటూ సిబ్బందిని నమ్మబలికి  తుని హంసవరం శివారున నిర్మానుష్యంగా ఉన్న తోటలోకి నారాయణరావు తీసుకెళ్లాడు. అత్యాచార యత్నం చేయబోతున్న సమయంలో తోట కాపలదారుడు గమనించి నిలదీశాడు. దీంతో.. ‘నేను ఎవరినో తెలుసా? కౌన్సిలర్‌ను. ఎస్సీలం. మాది వీరవరపుపేట’ అంటూ దబాయించాడు.

ఈలోపు.. కాపలదారుడు వీడియో తీస్తుండడం గమనించి.. బాలికను గురుకుల పాఠశా­లలో దించేసి నారాయణరావు కొండవారపే­ట పారిపోయాడు. అప్పటికే విషయం సోషల్‌ మీడియా ద్వారా వైరల్‌ కావడంతో స్థా­ని­కులు నారాయణరావును మంగళవారం రాత్రి పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగిం­చా­రు.

నారాయణరావు అరెస్ట్‌ను పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు మీడియాకు తెలిపారు. బాలికను ఆమె తల్లి అనుమతిలేకుండా పాఠశాల నుంచి తీసుకెళ్లడం, లైంగిక దాడికి యత్నించడం, తరచూ బాలికను బయటకు తీసుకెళ్లడంపై వేర్వేరుగా మూడు కఠినమైన కేసులు నమోదుచేశామని చెప్పారు. పోక్సో కేసులో నిందితుడికి 30 ఏళ్లకు పైగా శిక్ష పడుతుందన్నారు. విచారణకు ప్రత్యేక బృందాలను నియమించడంతో పాటు 15 రోజుల్లో ఛార్జిషీట్‌ దాఖలు చేసినట్లు తెలిపారు. ఈలోపే.. నిందితుడు పోలీసుల చెర నుంచి తప్పించుకుని ఇలా చెరువులో దూకేసి శవమై తేలాడు.

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)