Breaking News

సెప్టెంబర్‌ 18 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు: టీటీడీ ఛైర్మన్‌

Published on Wed, 08/30/2023 - 13:21

సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 18వ తేది నుంచి ప్రారంభం కానున్నట్లు టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి తెలిపారు. ఈనెల 26వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. సెప్టెంబరు 18న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని వెల్లడించారు. 

ఈ మేరకు ఆలయం వెలుపల బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను టీటీడీ చైర్మన్‌ విడుదల చేశారు. ఈ ఏడాది అధిక మాసం కారణంగా శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 22న గరుడ సేవ, 23న స్వర్ణరధం, 25న రధోత్సవం, 26న చక్రస్నానం, ధ్వజా అవరోహనం నిర్వహిస్తామన్నారు. 
చదవండి: జగ్గంపేట : నూత‌న వ‌ధువ‌రుల‌కు సీఎం జ‌గ‌న్ ఆశీర్వాదం

బ్రహ్మోత్సవాల సమయంలో అధిక రద్దీ నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నమని పేర్కొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఏడు రోజులు ఏటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని తెలిపారు. ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలను ఘనంగా, సాంప్రదాయంగా టీటీడీ సిబ్బందితో పాటుగా, అన్ని విభాగాల సమన్వయంతో ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని చెప్పారు. 

తిరుమలలో సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నమని భూమన కరుణాకర్‌ పేర్కొన్నారు. భక్తులకు భద్రత విషయంతో ఎటువంటి లోటు లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ సిబ్బంది విశ్వ ప్రయత్నం చేస్తోందని తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భక్తులు తరలిరావాలని కోరారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)