‘దేవుడికి దాతలు భూములిస్తారు.. మీరు దేవుడికి భూములు అమ్ముతారు’

Published on Mon, 03/09/2026 - 12:48

తిరుపతి:  తిరుమల శ్రీవారిని కూడా రాజకీయ అవసరాలకు వాడుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. టీటీడీ చరిత్రలో ఆలయాలకు భూమి కొన్నది లేదని, కానీ అమరావతి వెంకటాయపాలెంలో టీటీడీ ఆలయానికి భూమి కొన్నారని మండిపడ్డారు. 

వెంకటాయపాలెంలో దేవాలయ నిర్మాణానికి స్థలాన్ని దాతలు కానీ, సంస్థలు కానీ ఇస్తాయని, మరి దాన్ని పక్కనపెట్టి భూమి కొనడం ఏంటని ప్రశ్నించారు. ఈరోజు(సోమవారం, మార్చి 9వతేదీ) తిరుపతి నుంచి మాట్లాడిన భూమన.. ‘ దేవుడికి దాతలు భూములిస్తారు.. మీరు దేవుడికి భూములు అమ్ముతారు.ఉచితంగా టీటీడీ భూమి కోరితే సవాలక్ష నిబంధనలు పెట్టారు. వివిధ సంస్థలకు మాత్రం ఉచితంగా భూములు కేటాయించారు. టీటీడీ రూ. 12 కోట్ల సొమ్మును సీఆర్డీఏ వెనక్కి ఇవ్వాలి. మహిళల జోలికొచ్చిన టీటీడీ చైర్మన్‌ను చూస్తే అసహ్యించుకుంటున్నారు’ అని విమర్శించారు.

ఎవరూ ఈ సాహసం చేయలేదు..
నవీ ముంబైలో అప్పటి సీఎం ఏక్ నాథ్ షిండే వెంకటేశ్వర స్వామి ఆలయంకు ఉచితంగా స్థలం కేటాయించారు. జమ్మూకశ్మీర్ లో లెఫ్టినెంట్ గవర్నర్ జమ్మూలో ఉచితంగా శ్రీవారి ఆలయం నిర్మాణంకు ఉచితంగా స్థలం కేటాయించారు.  పల్లవ మహారాణి సమవాయి, చోళ రాణి పరాంతక మణి, యాదవ రాజులు, విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కౌనకాలు, ఆస్తులు ఇచ్చారు. టీటీడీ చరిత్రలో  ఏ ఒక్క చోట దేవాలయాలకు స్థలం కొన్నది లేదు. సీఎం చంద్రబాబు అమరావతి వెంకటాయ పాలెంలో 25  ఎకరాలు వెంకటేశ్వర స్వామి ఆలయంకు స్థలం కొనుగోలు చేశారు. ఎకరా 50 లక్షలకు అమ్మారు. రూ. 12 .50 కోట్లు ధర చెల్లించారు. ప్రపంచంలో ఏ ఒక్కరు ఇలాంటి సాహసం చేయలేదు.  ఆర్థికంగా వివిధ సంస్థలకు ఏపీ ప్రభుత్వం భూములు కేటాయింపు ఉచితంగా చేసింది. ఏపీ హ్యూమన్ రిసోర్స్ సంస్థకు ఉచితంగా స్థలాలు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం సంస్థ సెంట్రల్ ఇనిస్టిట్యూటల్‌ డిజైన్ ఉచితంగా భూమి కేటాయింపు చేసింది. 

మరి అమరావతిలో టీటీడీ ఆలయం నిర్మాణంకు  రూ. 12.50 కోట్లతో కొనుగోలు చేశారు. వ్యాపార రాజధాని కు వెంకటేశ్వర స్వామి వాణిజ్య అవసరాలకు వాడుకున్నారని స్పష్టంగా అర్థం అవుతోంది. తమిళనాడు చెన్నై జీ స్క్వేర్  రియల్ ఎస్టేట్ సంస్థ స్థలంలో  వెంకటేశ్వర  ఆలయం నిర్మాణం చేస్తున్నారు. చెన్నై ఆలయం విస్తరణకు టీటీడీ  దాతలు సహాయంతో చేశారు. నటి కాంచన ఇచ్చిన స్థలంలో అమ్మవారు ఆలయం నిర్మాణం చేశారు. 

బీఆర్‌ నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు..
గత ఏడాది కాలంగా మీరు చేస్తున్న అరాచకాలతో, హిందువులను అపహాస్యం చేస్తున్నారు.. భగవద్గీత పై రూ. 50 కోట్లు ఖర్చు  అని బీఆర్‌ నాయుడు  తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కోటి పుస్తకాలకు 52 లక్షలు పుస్తకాలు ప్రింట్ అయ్యాయి, భగవద్గీతకు ఇప్పటివరకు మూడున్నర కోట్లు ఖర్చు చేశారు.  పుస్తకానికి .3 రూపాయలు 71 పైసలు ఖర్చు అయ్యింది. బీఆర్‌ నాయుడు బుకాయిస్తే సరిపోదు..పదవికి రాజీనామా చేయాలి’ అని డిమాండ్‌ చేశారు.


 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)