Breaking News

టీటీడీ ఉద్యోగిని... హోం మంత్రికి చాలా క్లోజ్‌

Published on Sun, 10/19/2025 - 05:29

తిరుమల: ‘నేను టీటీడీలో ఉద్యోగిని. రాష్ట్ర హోం మంత్రి అనితకు బాగా క్లోజ్‌. ఆమె తరఫున వచ్చే వీఐపీలకు నేనే ప్రొటోకాల్‌ దర్శనం చేయిస్తా’ అంటూ భక్తులకు మాయమాటలు చెప్పి మోసం చేసిన టీడీపీ నాయకుడి గుట్టు రట్టయ్యింది. తిరుపతి జిల్లా, చంద్రగిరి రెడ్డివీధికి చెందిన బురిగాల అశోక్‌ రెడ్డి గత టీడీపీ హయాం నుంచి తిరుమలలో దళారీగా చలామణి అవుతున్నాడు. టీడీపీ సీనియర్‌ నేత కళా వెంకటరావు, హోం మంత్రి వంగల పూడి అనితతోపాటు చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి దిగిన ఫొటోలు చూపిస్తూ భక్తులను మోసగిస్తుంటాడు. 

దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను టార్గెట్‌ చేస్తూ డబ్బులు దండుకుంటున్నాడు. తెలంగాణకు చెందిన భజరంగ్‌ అమన గోయల్, పది మంది కుటుంబ సభ్యులకు సుప్రభాతం, తోమాల, అభిõÙకం సేవలతో పాటుగా బ్రేక్‌ దర్శనం కల్పిస్తానని హామీ ఇచ్చాడు. ఈ దర్శనాలకు చాలా ఖర్చవుతుందని నమ్మించాడు. తిరుమలకు రాకముందే బేరసారాలు సాగించాడు. ఫైనల్‌గా గూగుల్‌ పే, ఫోన్‌ పే ద్వారా రూ.4 లక్షలు వసూలు చేశాడు. 

ఇటీవల భక్త బృందం తిరుమలకు రాగానే అదనంగా రూ.10 వేలు తీసుకున్నాడు. వెంటనే అక్కడి నుంచి జారుకున్నాడు. బయటకు వెళ్లిన వెంటనే మొబైల్‌ ఫోన్‌ను స్విచ్‌ ఆఫ్‌  చేశాడు. ఎన్ని సార్లు చేసినా ఫోన్‌ తీయకపోవడంతో మోసపోయామని గ్రహించి భక్తులు శుక్రవారం ఈ–మెయిల్‌ ద్వారా టీటీడీ విజిలెన్స్‌ వింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్‌ వింగ్‌ ఏవీఎస్‌ఓ ఫిర్యాదు మేరకు తిరుమల టు టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం కేసు నమోదు చేశారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)