Breaking News

గోబ్యాక్.. ఎమ్మెల్యేను అడ్డుకున్న గిరిజనులు

Published on Mon, 12/01/2025 - 15:04

సాక్షి శ్రీకాకుళం: టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు సరుబుజ్జులి మండలం వెన్నెల వలసలో గిరిజనుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యేను గిరిజనులు అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో థర్మల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టవద్దంటూ నినాదాలు చేశారు. కూన రవికుమార్ ఇక్కడి నుండి వెళ్లిపోవాలంటూ ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.

అయితే  కొద్ది రోజుల క్రితం థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా వెన్నెలవలస నుంచి సరుబుజ్జిలి వరకూ ర్యాలీ నిర్వహించాలని తలపించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే గిరిజనులు నిరసనలు చేపట్టారు. సురుబుజ్జి, బూర్జ మండలాలలో పవర్ ప్లాంట్ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని పవర్ ప్లాంట్ నిర్మాణంతో పర్యావరణానికి తీవ్ర స్థాయిలో ముప్పు ఏర్పడుతుందని తెలిపారు. 

థర్మల్ ప్లాంట్ నిర్మాణం వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుందని గిరిజనులు భావిస్తున్నారు. స్థానికుల జీవనోపాధి అయిన అడవులు, నీటి వనరులు, వ్యవసాయం ప్రభావితమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న గిరిజనులు.. ఈ మేరకు నిరసనల చేపట్టారు.  ఇది గత కొంతకాలం నుంచి కూటమి ప్రభుత్వానికి  ఎదురవుతున్న నిరసన సెగ. ఇప్పటికే -థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ శ్రీకాకుళంలో ర్యాలీలు నిర్వహిస్తూ, ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. స్థానికులు తమ భూములు, వనరులు కాపాడుకోవడానికి సంఘటిత పోరాటం చేస్తున్నారు.

ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు ఎదురైన నిరసన సెగ.. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని స్పష్టంగా చూపిస్తోంది. ఈ సంఘటనతో థర్మల్ ప్లాంట్ ప్రతిపాదనపై రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తం అయ్యే అవకాశం ఉంది. గిరిజనుల నిరసనను విస్మరిస్తే మాత్రం వారి నిరసనలు మరింత ఎక్కువయ్యే అవకాశాలు  ఉన్నాయి.  ఎందుకంటే ఇది ప్రజల జీవనాధారానికి సంబంధించిన సమస్య కాబట్టి, వారి నిరసనకు ప్రజాబలం పెరుగుతుంది. మొత్తంగా, శ్రీకాకుళం జిల్లాలో థర్మల్ ప్లాంట్ నిర్మాణం గిరిజనుల ఆందోళనలకు కేంద్రబిందువుగా మారింది.

ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పై  గిరిజనుల తిరుగుబాటు  

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)