నేడు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ 

Published on Sat, 10/14/2023 - 03:06

తిరుమల:  అక్టోబర్‌ 15–23వ తేదీ వరకు జరగనున్న శ్రీవా­రి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శనివారం రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వ­హించనున్నారు. ఇందులో భాగంగా శ్రీవారి తరఫున సేనాధిపతి అయిన విష్వక్సేనులవారు ఆలయ మాడ వీధు­ల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఈ ఘట్టం తరువాత రంగనాయకుల మం­డపంలో ఆస్థానం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతి­రోజూ ఉదయం, రాత్రి వాహన సేవలు జరుగుతా­యి. బ్రహ్మోత్సవాల తొలిరోజు అక్టోబర్‌ 15న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పెద్దశేష వాహనసేవ ని­ర్వ­హిస్తారు.

మరోవైపు నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరు­మల ముస్తాబైంది. తిరుపతి/తిరుమలలో ఎటు చూసి­నా నవరాత్రి బ్రహ్మోత్సవాల పోస్టర్లను అతికించారు. వైభ­వం మండపం వద్ద టీటీడీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, పూల మొక్కల నడుమ అనంతపద్మనాభ స్వామి నమూ­నా ఆలయం ఆకట్టుకుంటున్నాయి. రామాయణం గుర్తు చే­సే విధంగా రామ, లక్ష్మణ, భరత, శతృజు్ఞలను దశరధుడు ఉయ్యాలలో ఊపే ఊహా చిత్రాన్ని సుందరంగా చిత్రీకరించారు. విద్యుత్‌ వెలుగులతో తిరుమలగిరి, ఆలయ మహాగోపురాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 

శ్రీవారి సేవలో ప్రముఖులు 
శ్రీవారిని శుక్రవారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వేణుగోపాల్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సతీమణి దుర్గా స్టాలిన్, అపోలో చైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా, టీటీడీ అధికారులు లడ్డు ప్రసాదాలతో సత్కరించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)