Breaking News

మద్దతు ధర కోసం పొగాకు రైతుల ఆందోళన

Published on Tue, 08/04/2026 - 05:56

పర్చూరు (చినగంజాం)/కందుకూరు: పొగా­కుకు మద్దతు ధర కోరుతూ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. దీంతో ప్రకాశం జిల్లా కందుకూరులోని రెండు వేలం కేంద్రాల్లో రైతులు ఆందోళన కొనసాగిస్తుండగా.., బాపట్ల జిల్లా పర్చూరులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేసి, రాస్తారోకో చేశారు. పొగాకుకు మద్దతు ధర ఇవ్వాలని, చివరి కేజీ వరకు ప్రభుత్వమే కొనాలని డిమాండ్‌ చేస్తూ బాపట్ల జిల్లా పర్చూరులో పొగాకు రైతులు సోమవారం భారీ ర్యాలీ, ధర్నా చేశారు. పొగాకు కాడల దండలు చేత పట్టుకొని పర్చూరు బస్టాండ్‌ సెంటర్‌ నుంచి బొమ్మల సెంటర్‌ వరకు ర్యాలీ చేశారు.

అక్కడ వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులరి్పంచారు. అనంతరం బొమ్మల సెంటర్‌లో ధర్నా చేశారు. వైఎస్సార్‌సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి గాదె మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో రైతులు, మహిళా రైతులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. బొమ్మల సెంటర్‌ వద్ద పొగాకు రైతులు శాంతియుతంగా చేస్తున్న ధర్నాను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

రైతులు, మహిళలను వారిని ప్రతిఘటించడంతో పోలీసులు అక్కడి నుంచి తప్పుకొన్నారు. రైతులు అక్కడి నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. అనంతరం తహసీల్దార్‌ బ్రహ్మయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గాదె మధుసూదనరెడ్డి మాట్లాడుతూ రైతుల నుంచి పొగాకు చివరి కేజీ వరకు ప్రభుత్వమే కొనాలని డిమాండ్‌ చేశారు. అప్పటివరకు రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని అన్నారు.

కందుకూరులో కొనసాగుతున్న ఆందోళన 
ప్రకాశం జిల్లా కందుకూరులోని రెండు వేలం కేంద్రాల్లో పొగాకు రైతుల ఆందోళన కొనసాగుతోంది. కనిగిరి రోడ్డులోని ఒకటో వేలం కేంద్రం వద్ద రైతులు ధర్మ దీక్ష పేరుతో నిరసన దీక్షను కొనసాగించారు. పామూరు రోడ్డులోని రెండో కేంద్రంలో వేలాన్ని అడ్డుకున్న రైతులు రాస్తారోకో చేశారు. రైతులకు ఏపీ రైతు సంఘం సంఘీభావం ప్రకటించి, ఆందోళనలో పాల్గొంది. పొగాకు బోర్డు ఆర్‌ఎం వేలం కేంద్రం వద్దకు వచ్చి రైతులతో చర్చించారు. పొగాకు క్వింటా రూ.30 వేలకు కొనాలని రైతులు డిమాండ్‌ చేశారు. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)