Breaking News

కిరణ్‌ రాయల్‌కు శ్రీవారి వస్త్రం, నల్లి సిల్క్స్‌తో సంబంధమేంటి?: లక్ష్మీ

Published on Sat, 02/15/2025 - 12:23

సాక్షి, తిరుపతి: జనసేన నాయకుడు కిరణ్‌ రాయల్‌పై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు బాధితురాలు లక్ష్మీ. తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్‌ అమ్ముకుని బ్రతికే వ్యక్తి కిరణ్‌ అని చెప్పారు. అలాగే, శ్రీవారి వస్త్రం అమ్ముకుని వ్యాపారం చేస్తున్నాడని అన్నారు. ఇదే సమయంలో అమ్మాయిలను మోసం చేసి విలాసవంతమైన జీవితం గడిపిన వ్యక్తి కిరణ్‌ రాయల్‌ అని ఆరోపించారు. ఆయన కుటుంబానికి కావాల్సింది డబ్బులు మాత్రమేనని వెల్లడించారు.

జనసేన నాయకుడు కిరణ్‌ రాయల్‌ బాధితురాలు లక్ష్మీ శనివారం తిరుపతితో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా లక్ష్మీ.. ‘కిరణ్ రాయల్ ఏం వ్యాపారాలు చేస్తున్నాడు. అంత లగ్జరీ జీవితం ఎలా గడుపుతున్నాడు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి.. ఇంత డబ్బు ఎక్కడిది?. తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు అమ్ముకుని బ్రతుకుతున్నాడు. తిరుమలకు వచ్చే భక్తులను మోసం చేసే దుర్మార్గుడు. కిరణ్‌ రాయల్‌కు చెన్నైలోని నల్లి సిల్క్స్‌తో ఏం సంబంధం ఉంది?. తాను మోసం చేసే ప్రతీ అమ్మాయిని అక్కడికి తీసుకెళ్లి వారితో ఖరీదైన చీరలను కొనుగోలు చేయిస్తాడు. వేలు ఖర్చు చేయించి మరీ చీరలు కొంటాడు. నల్లి సిల్క్స్‌లో ఏం జరుగుతుందో నేను చెప్పను. ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. 

ఇక, తిరుమలలో శ్రీవారికి ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఇచ్చే వస్త్రం అది. ఒక టికెట్ ద్వారా అది ఇస్తారంటా. అక్కడ కొన్ని చీరలను ఇంటికి తీసుకువచ్చి పసుపు, కుంకుమ చల్లి.. రాత్రి వాళ్ల ఇంట్లోనే ఉంచి.. దేవుడి చీరలని అమ్ముకుంటాడు. శ్రీవారి వస్త్రం టికెట్ అమ్ముకుని వ్యాపారం చేస్తున్నాడు. వస్త్రం, చీరల బాధితులు కూడా ఉన్నారు. వారు కూడా త్వరలోనే బయటకు వస్తారు. ఏడు కొండల స్వామిని కూడా మోసం చేస్తున్న వ్యక్తి కిరణ్‌. ఇలా మోసం చేసి సంపాదించడమే కిరణ్‌ రాయల్‌కు తెలుసు. ఎంతో మంది అమ్మాయిలను మోసం చేసి.. అందరినీ బ్లాక్ మెయిల్ చేస్తాడు.. బెదిరిస్తాడు. వారి ఫొటోలను మార్ఫింగ్‌ చేసి వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇవ్వన్నీ అతడి భార్యకు, కుంటుంబ సభ్యులకు కూడా తెలుసు. కానీ, వారికి కావాల్సిందే డబ్బు మాత్రమే. అందుకే కిరణ్‌కు వారి సపోర్టు ఉంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

 ఇది కూడా చదవండి: కిరణ్‌ రాయల్‌ పరమ నీచుడు.. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు: లక్ష్మీ

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)