Breaking News

తిరుమల సమాచారం ఇలా.. నేడు ఏప్రిల్‌ నెల దర్శన టికెట్ల విడుదల

Published on Fri, 01/24/2025 - 08:01

సాక్షి, తిరుమల: తిరుమలకు సంబంధించి నేటి సమాచారం ఇలా ఉంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి 15 కంపార్ట్‌మెంట్స్‌లో భక్తులు వేచి ఉన్నారు. ఇక, సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ప్రత్యేక దర్శనానికి 5 గంటలు పడుతోంది. ఇక, నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 56,225లుగా ఉండగా.. నిన్న తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 19,588. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం 3.95 కోట్లుగా ఉంది.

మరోవైపు.. నేడు ఏప్రిల్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఏప్రిల్‌ నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈరోజు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఇక తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటాను కూడా విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతి‌లో ఏప్రిల్‌ నెల గదుల కోటాను ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

ఇదిలా ఉండగా.. ఈ నెల 27వ తేదీన శ్రీవారి సేవ సాధారణ, నవనీత, పరాకామణి సేవ కోటాను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు యధా ప్రకారం విడుదల చేస్తారు. కాగా, https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ సూచించింది. 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)