Breaking News

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దాష్టీకాలు మొదలు

Published on Tue, 06/11/2024 - 06:22

నెల్లూరు (బారకాసు): ఎన్నికలు ముగియగానే నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దాష్టీకాలు ప్రారంభమయ్యాయి. నెల్లూరు మేయర్‌ దంపతులను బెదిరించి రాజకీయ అరాచకానికి తెరతీశారు. గిరిజన మహిళ రిజర్వేషన్‌తో వైఎస్సార్‌సీ­పీ నుంచి మేయర్‌గా ఎన్నికైన పోట్లూరి స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్‌లను పార్టీ మారాలని, లేదంటే కేసుల్లో ఇరికిస్తామని బెదిరించారు. నిస్సహాయ స్థితిలో ఆ గిరిజన దంపతులు వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు, నేతలను టీడీపీలో చేరాలంటూ ఎన్నికలకు ముందు నుంచే శ్రీధర్‌రెడ్డి బెదిరింపులకు దిగారు.

కొందరిపై రాజకీయంగానూ కేసులు పెట్టించారు. ఇప్పుడు అధికార పార్టీలో ఉండటంతో మరింతగా బెదిరింపులకు దిగుతున్నారు. రెండున్నరేళ్ల క్రితం జరిగిన నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో 12వ డివిజన్‌ నుంచి పోట్లూరి స్రవంతి వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలుపొందారు. ఈ డివిజన్‌ నెల్లూరు రూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉండటంతో స్రవంతి దంపతులు అప్పట్లో వైఎస్సార్‌సీపీలోనే ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అనుచరులుగా కొనసాగేవారు.

అప్పటి మంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్‌ సహకారంతో స్రవంతి మేయర్‌గా ఎన్నికయ్యారు. 9 నెలల క్రితం రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ సమయంలో మేయర్‌ స్రవంతి దంపతులు, కొందరు కార్పొరేటర్లు ఆయన వెంట వెళ్లారు. కొద్దిరోజుల్లోనే స్రవంతి దంపతులు తిరిగి వైఎస్సార్‌సీపీ గూటికి చేరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి టీడీపీ టిక్కెట్‌పై గెలుపొందారు.

జరిగిందిదీ..
నెల్లూరు నగరంలో దాదాపు 70 భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ లేకుండానే తనఖా చేసిన ఆస్తులను మాన్యువల్‌గా కమిషనర్‌ ఫోర్జరీ సంతకాలతో రిలీజ్‌ ఆర్డర్లు ఇచ్చారని, దీనివల్ల ప్రభుత్వానికి రూ.కోట్లు నష్టం వచ్చిందంటూ ఓ న్యాయవాది నగర పాలక సంస్థ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో మేయర్‌ భర్త జయవర్ధన్‌ పాత్ర ప్రధానంగా ఉన్నట్లు ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారంపై కమిషనర్‌ విచారణకు ఆదేశించారు.

గతంలో తన వెంట ఉండి, వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతున్న మేయర్‌ దంపతులను తన దారికి తెచ్చుకునేందుకు, వారిపై పెత్తనం సాగించేందుకు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి ఈ ‘ఫోర్జరీ’ ఫిర్యాదును ఆయుధంగా ఉపయోగించుకున్నారు. టీడీపీలో చేరితే కేసులు ఉండవని, లేదంటే జైలుకు పంపిస్తామని బెదిరించారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో భయపడిన ఆ గిరిజన దంపతులు నిస్సహాయ స్థితిలో వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)