Breaking News

‘ఆంటీ...ఇల్లు చూట్టానికి వచ్చారు...కిందకు రండి !’

Published on Sun, 06/22/2025 - 14:15

తెనాలి: ఒకే ఇంట్లో ఇద్దరు వృద్ధ మహిళలను హత్య చేసి బంగారు నగలను అపహరించిన కేసులో మారీసుపేటకు చెందిన అత్తోట కుసుమ అనే మహిళ ప్రధాన సూత్రధారిగా పోలీసులు నిర్ధారణ కొచ్చారు. ఆమెను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. విచారణలో మరో వృద్ధురాలి హత్యతో పాటు, ఇంకొకరి హత్యకు రెక్కీ నిర్వహించినట్టు తెలిసీ, ఆ కోణంలో దర్యాప్తు జరుగుతోందని విశ్వసనీయ సమాచారం. దీనితో మారీసుపేట, మల్లెపాడు గ్రామంలో కలకలం రేగింది.

ఇన్స్యూరెన్స్‌ ఏజెంటుగా వివరాల సేకరణ
తెనాలి పట్టణం మారీసుపేటలో కుసుమ నివాసం. ఆమె భర్త 15 ఏళ్ల క్రితమే మృతి చెందాడు. ఇద్దరు సంతానం. కాలేజీకి వెళుతున్నారు. గతంలో ‘మెప్మా’ విభాగంలో తాత్కాలికంగా పని చేసింది. ప్రస్తుతం ప్రైవేటు ఇన్సూరెన్స్‌ కంపెనీ ఏజెంటుగా పని చేస్తోంది. పాలసీల పేరుతో అందరినీ కలుస్తూ వారి వివరాల ఆధారంగా నేరాలకు ప్రణాళికను రచిస్తోంది. తన సహాయకులతో పక్కాగా అమలు చేస్తోంది. తెనాలి నుంచి చినపరిమి వెళ్లే రోడ్డులో మూతపడిన అప్పడాల కంపెనీ పైభాగంలో వితంతువులైన వియ్యపురాళ్లు దాసరి రాజేశ్వరి (65), పిట్టా అంజమ్మ (70) నివసిస్తున్నారు. ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం ఆ ఇద్దరు హత్యకు గురయ్యారు. వీరి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. ఈ కేసులో కుసుమ సహా ఆటోడ్రైవర్‌, మరొక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హత్యకు ప్లాన్‌ ఇలా..
హత్యకు గురైన వృద్ధుల ఇంటికి ఆ రోజు ఒక ఆటోలో కుసుమ సహా మరో ఇద్దరు యువకులు వచ్చారు. ‘ఆంటీ...ఇల్లు చూట్టానికి వచ్చారు...కిందకు రండి !’ అని కుసుమ పిలవడంతో ఒక వృద్ధురాలు కిందకు వచ్చారు. కిందకు వెళ్లినామె ఎంతకీ పైకి రాకపోవటతో ఇంకో వృద్ధురాలు, ‘ఇంకా రాలేదేంటి...పైకి రా!’ అని వియ్యపురాలిని కేకేసింది. దీనితో మళ్లీ కుసుమ, ఆమెను కూడా ‘కిందకు రండి...పిలుస్తున్నారు !’ అనడంతో ఆమె కూడా దిగివచ్చింది. తర్వాత ఆ ముగ్గురూ అదే ఆటోలో తిరిగి వెళ్లిపోయారు. ఇదంతా ఇంటిముందున్న సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు కుసుమతో సహా ఆ ఇద్దరు యువకులను తేలిగ్గా పట్టుకోగలిగారు. విచారణలో వారు కూడా విస్తుపోయే మరికొన్ని నిజాలు తెలిసినట్టు విశ్వసనీయ సమాచారం.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)