Breaking News

టీడీపీ ఎమ్మెల్యే సతీమణి హల్‌చల్‌.. ఇదేం తీరు?

Published on Thu, 11/05/2026 - 12:19

సాక్షి, చంద్రగిరి: ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ వేళ చంద్రగిరిలో వైఎస్సార్‌సీపీ నేతలను టీడీపీ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో, సుధారెడ్డిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదేం తీరని ప్రశ్నిస్తున్నారు.

చంద్రగిరిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పోలింగ్‌ కేంద్రాలను సందర్శిస్తున్న సమయంలో సుధారెడ్డి కూడా ఆయన వాహనాన్ని అనుసరిస్తూ అక్కడికి చేరుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆయన ఎక్కడికి వెళ్తే సుధారెడ్డి అటే వెళ్లడం గమనార్హం.

 

చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్‌ జరగాల్సిన సమయంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పర్యటనలపై సుధారెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికే తాము కూడా వెళ్తామని స్పష్టం చేస్తూ హడావుడి చేశారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కారును సుధారెడ్డి తన వాహనంతో వెంబడించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ‘నేను ఎస్కార్ట్‌.. చెవిరెడ్డి వెంటే ఉంటా.. ఆయన ఎక్కడికి వెళ్తే మా వాహనం కూడా అక్కడికే వెళ్తుంది’ అంటూ ఆమె కామెంట్స్‌ చేస్తూ చెవిరెడ్డిని రెచ్చగొట్టేలా వ్యవహరించేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

సహనం పాటించిన చెవిరెడ్డి
పోలింగ్‌ కేంద్రాల వద్ద పర్యటిస్తున్న సమయంలో ఎదురైన ఈ పరిణామాలపై చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సంయమనం పాటించారు. ప్రత్యర్థి వర్గం నుంచి ఎదురైన సవాళ్లకు స్పందించకుండా తన పర్యటన కొనసాగించారు. మొత్తంగా చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్‌ సమయంలో చోటుచేసుకున్న ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల వేళ నాయకులు, వారి అనుచరులు సంయమనం పాటించి ప్రశాంత పోలింగ్‌కు సహకరించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)