Breaking News

ఒక్కో కార్పొరేటర్‌కు రూ.40 లక్షలు..?

Published on Sat, 12/13/2025 - 11:05

మేయర్‌ స్రవంతిపై పెట్టిన అవిశ్వాసం రసకందాయంలో పడింది. అధికార, అర్థబలముంది.. ఇక తమకు తిరుగులేదని నిన్నటి వరకు బీరాలు పలికిన టీడీపీకి ఐదుగురు కార్పొరేటర్లు ఝలక్‌ ఇచ్చారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో వారు చేరడంలో సైకిల్‌ పార్టీకి మైండ్‌ బ్లాకైంది. ఉన్న వారు చేజారిపోతారనే ఆందోళనతో కలవరపాటుకు గురై క్యాంప్‌ రాజకీయాలను స్టార్ట్‌ చేసింది. తాయిలాలతో పాటు విందు, వినోదాలనూ ఏర్పాటు చేశారనే టాక్‌ సింహపురిలో గుప్పుమంటోంది. మొత్తమ్మీద నో కాన్ఫడెన్స్  మోషన్‌ ప్రక్రియ టీడీపీ కాన్ఫడెన్స్ ను దెబ్బతిస్తోంది.

సాక్షి పొలిటికల్‌ టాస్‌్కఫోర్స్‌: అవిశ్వాసం.. ఈ పదం వింటే సింహపురిలో టీడీపీ నేతలు వణికిపోతున్నారు. మేయర్‌పై ఈ నెల 18న జరగనున్న ఈ ప్రక్రియలో విజయం నల్లేరుపై నడక అని నిన్నామొన్నటి వరకు అంతా భావించారు. అయితే సీన్‌ కట్‌ చేస్తే పరిణామాలు గురువారం అత్యంత వేగంగా మారిపోయాయి. ఆ పార్టీలో ఇమడలేక.. అవమానాలను తట్టుకోలేక ఐదుగురు గుడ్‌బై చెప్పి మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ పరిణామంతో మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీంతో తమ కుట్రలకు తెరలేపి తాడేపల్లిలో ఒక కార్పొరేటర్‌తో పాటు మరొకరి కుమారుడ్ని కిడ్నాప్‌ చేయించారు. ఆపై వారిని బెదిరించి టీడీపీ కండువాలు కప్పి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. మరోవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా క్యాంప్‌ రాజకీయాలకు తెరలేపారు.
 
నాడు విస్మరణ.. నేడు ప్రాధేయపడుతూ.. 
వాస్తవానికి నాలుగేళ్ల క్రితం జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో 54 డివిజన్లకు గానూ అన్నింటినీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. అయితే గతేడాదిలో కొలువుదీరిన టీడీపీ సర్కార్‌.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పోకడను అవలంబించింది. ఈ క్రమంలో 40 మంది కార్పొరేటర్లను ప్రలోభాలను గురిచేసి తమ పంచన చేర్చుకుంది. ఈ తరుణంలో సైకిలెక్కిన వారిని నిన్నామొన్నటి వరకు చీపురుపుల్లల్లా మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి తీసేశారు. అయితే ఇప్పుడు వారు అవసరం కావడంతో బుజ్జగింపుల పర్వానికి తెరలేపారు. ఇదే అదునుగా కొందరు రేటును ఫిక్స్‌ చేసి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. 

అనిల్‌ రంగప్రవేశంతో సీన్‌ రివర్స్‌ 
వాస్తవానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మేయర్‌ స్రవంతి రాజీనామా చేసి తటస్థంగా ఉన్నారు. దీంతో అవిశ్వాసానికి ఆ పార్టీ దూరంగా ఉండింది. ఈ తరుణంలో టీడీపీ వ్యవహార శైలికి అడ్డుకట్టేయాలని భావించిన మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ రంగంలోకి దిగారు. కార్పొరేటర్లను తిరిగి పార్టీలో చేరి్పంచడంతో నివ్వెరపోవడం నెల్లూరు సిటీ, రూరల్‌ ఎమ్మెల్యేల వంతైంది. దీంతో మరికొందరు చేజారి పోకుండా క్యాంపులకు తరలించారు. 

క్యాషే.. క్యాషు
నిన్నామొన్నటి వరకు కార్పొరేటర్లను లెక్కచేయలేదు. ఈ తరుణంలో అనిల్‌ రంగప్రవేశంతో వీరికి డిమాండ్‌ అమాంతం పెరిగింది. మంత్రి, ఎమ్మెల్యే రంగంలోకి దిగి.. కండువాలు మార్చకండంటూ ప్రాధేయపడటాన్ని ప్రారంభించారు. తాయిలాలనూ ఎరేశారు. ఒక్కో కార్పొరేటర్‌కు రూ.25 లక్షల వరకు ఆఫర్‌ ఇచ్చి క్యాంపునకు తరలించే వాహనమెక్కించారు. సందట్లో సడేమియాగా నెల్లూరు సిటీకి చెందిన ఒకరు రూ.40 లక్షలను డిమాండ్‌ చేశారనే చర్చ స్టార్టయింది. కొసమెరుపేమిటంటే ఈ మొత్తాన్ని ముందే ఇస్తేనే వాహనమెక్కుతానని స్పష్టం చేయడంతో ఆయన అడిగినంత మేర సమర్పించారనే టాక్‌ నడుస్తోంది. దీంతో ఆయన క్యాంపునకు సై అన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా కార్పొరేటర్ల గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక నారాయణ, కోటంరెడ్డి సతమతమవుతున్నారని పలువురు నవ్వుకుంటున్నారు.  

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)