Breaking News

తిరుపతిలో కూటమి ఎమ్మెల్యేల హైడ్రామా

Published on Thu, 04/17/2025 - 13:03

తిరుపతి,సాక్షి: తిరుపతిలో కూటమి ఎమ్మెల్యేల హైడ్రామా మరోసారి బట్టబయలైంది. గోశాలకు మరోసారి రమ్మని టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డికి ఫోన్‌ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు నాని, సుధీర్ రెడ్డి, అరణి శ్రీనివాసులు తోక ముడిచారు.  

ఫోన్‌లో భూమనను రమ్మనమని అడ్డుకోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు పోలీసుల్ని ఆదేశించారు. దీంతో మీడియా ముందు డ్రామా ఆడి టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డంగా దొరికిపోయారు. ఫోన్‌ చేసిన ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పేందుకు భూమన బయల్దేరగా.. ఇంటి వద్దే ఆయనను పోలీసులు నిర్భందించారు. గోశాలకు వెళ్లి టీడీపీ ఎమ్మెల్యేలను ఎంపీ గురుమూర్తి ప్రశ్నించారు. ఎంపీ గురుమూర్తి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. 

టీడీపీ ఛాలెంజ్‌ను స్వీకరించేందుకు గోశాల లోపలికి వచ్చేందుకు ప్రయత్నించిన భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో మీడియా సాక్షిగా టీడీపీ ఎమ్మెల్యేల బండారం బట్టబయలైంది.

ఎమ్మెల్యేల దారిలో పల్లా
మరోవైపు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు భూమన ఫోన్‌ చేశారు. మీరు ఎక్కడున్నారు.. మీ సవాల్‌కు సిద్ధమన్న భూమన. గోశాలలో గోవుల మరణాలు నిగ్గు తేల్చేందుకు నేను సిద్ధం. మీరు ఎక్కుడున్నారని పల్లాను  భూమన ప్రశ్నించారు. ఈ క్రమంలో భూమన ఫోన్‌ కాల్‌ను పల్లా శ్రీనివాస్‌ కట్‌ చేశారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)