Breaking News

ఎమ్మెల్యే ఇంట్లోనే నన్ను తీవ్రంగా కొట్టారు

Published on Sun, 07/07/2024 - 04:35

గుంటూరు: నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద్‌బాబు గృహంలోనే తనపై మారణాయుధాలతో దాడిచేశారని ఆ పార్టీ కార్యకర్త అల్లూరి హరికృష్ణ తెలిపారు. తీవ్రంగా గాయపడిన తనకు కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వకుండా ఎమ్మెల్యే బయటకు నెట్టేశారని  చెప్పా­రు. 4న నరసరావుపేటలోని ఎమ్మెల్యే అరవింద్‌బాబు గృహంలో తె­లుగు తమ్ముళ్లు వర్గాలుగా విడిపో­యి తన్నుకున్నా­రు. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన హరికృష్ణ నరసరావుపేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన నుంచి శుక్రవారం రాత్రి వన్‌టౌన్‌ పోలీసు­లు ఫిర్యాదు స్వీకరించి 43మందిపై కేసు నమోదు చేశారు.

హరి­కృష్ణ శనివారం ఆస్పత్రిలో మీడియా­తో మాట్లాడారు. ‘నా సొంత ఊరు నరసరావుపేట మండలం ఇసప్పాలెం. నరసరావుపేట శ్రీనివాసనగర్‌లో ఉంటూ పల్నాడు రోడ్డులో బ్లడ్‌ బ్యాంకు నిర్వహిస్తున్నాను. 4న సాయంత్రం ఎమ్మెల్యేతో డీఎంహెచ్‌వోకు ఒక ఫోన్‌ చేయించుకోవాలనే ఉద్దేశంతో ప్రకాష్‌నగర్‌లోని ఆయన ఇంటికి వెళ్లగా...  ప్రసా­ద్, సురేష్, సాయి, రాజేష్, అంకమ్మరాజు, కాళీ, ప్రేమ్‌­కుమార్, నవీన్, బొట్టు సాయితోపాటు మ­రో 40మంది కర్రలు, కత్తులు, ఇనపరాడ్లు పట్టు­కు­ని బైక్‌లపై ఎమ్మెల్యే గృహంలోకి వచ్చి పూలకుండీ­లు, కురీ్చలు పగలగొట్టారు.

అక్కడే నిలబడి ఉన్న నాపై మారణాయుధాలతో దాడి చేయడంతో నా ఎడమ చేయి మోచేతి కిందభాగంలో ఎముక విరిగింది. తల, వీపుపై గాయాలయ్యాయి. అక్కడకు వచ్చి­న వారిలో సురేష్‌ అనే వ్యక్తి నన్ను గుర్తుపట్టి తెలిసినవాడే అనడంతో వదిలేశారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేను తీవ్రంగా గాయపడిన నేను తాగేందుకు మంచినీళ్లు ఇవ్వాలని అడిగితే బయటకు నెట్టివేసి లోపలికి వెళ్లిపోయారు. మా గ్రామం టీడీపీకి కంచుకోట. నేను కూడా అరవిందబాబు గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశా. అయినా నాకు తాగేందుకు మంచినీళ్లు ఇవ్వలేదు. రెండు రోజులుగా ఆస్పత్రిలో ఉన్నా పరామర్శించేందుకు కూడా ఎమ్మెల్యే రాలేదు.’ అని చెప్పారు. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)