Breaking News

సీటు లేక పాట్లు

Published on Mon, 02/26/2024 - 11:17

సాక్షి, అమరావతి: సీట్ల కేటాయింపు తర్వాత టీడీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడటంతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు బుజ్జగింపుల పర్వా­నికి తెరతీశారు. అలక పాన్పు ఎక్కిన నేతలను పిలిచి సర్దిచెబుతున్నారు. ఆదివారం ఉండవల్లి­లో­ని తన నివాసంలో సీనియర్‌ నేతలు దేవినేని ఉ­మా­మహేశ్వరరావు, ఆలపాటి రాజా, గంటా శ్రీని­వాసరావు, పీలా గోవింద సత్యనారాయణ, బొడ్డు వెంకట రమణలతో విడివిడిగా చర్చలు జరిపారు. 

► తొలి జాబితాలో సీటు దక్కని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని చంద్రబాబు మరోసారి సూచించా­రు. తనను ఓడిపోయే చోటకు ఎందుకు పంపు­తు­న్నారని గంటా ప్రశ్నించడంతో గెలుస్తా­వంటూ ఒప్పించేందుకు చంద్రబాబు ప్రయ­త్నించారు. గంటా ఇందుకు ససేమిరా అంటూ భీ­మి­లి లేదా విశాఖ జిల్లాలో ఏదైనా సీటు ఇవ్వాలని కోరారు. జి.మాడుగుల, చోడవరం స్థానాలకు తన పేరు పరిశీలించాలని కోరినట్లు తెలిసింది. 

► మైలవరం సీటు తనకే ఇవ్వాలని దేవినేని ఉమామహేశ్వరరావు కోరగా ఆ సీటు వసంత కృష్ణప్రసాద్‌కి ఇస్తున్నానని చంద్రబాబు చెప్పిన­ట్లు తెలిసింది. ప్రత్యామ్నాయం చూస్తానని దేవినేనికి సర్దిచెప్పారు. ఆయన పేరును పెనమలూరుకు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

► తెనాలిని జనసేనకు కేటాయించడంతో సీటు గల్లంతైన మాజీ మంత్రి ఆలపాటి రాజాతో చంద్రబాబు మంతనాలు జరిపారు. అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ఆయన్ను బుజ్జగించినట్లు తెలిసింది. అయితే గుంటూరు జిల్లాలో ఏదైనా సీటు ఇవ్వాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది.

► తూర్పు గోదావరి జిల్లా రాజానగరం సీటును ఆశిస్తున్న బొడ్డు వెంకట రమణకు భవిష్య­త్తులో న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఆయన అసంతృప్తితో నిష్క్రమించారు.

అనకాపల్లి సీటును జనసేనకు కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందుకు నచ్చజె­ప్పేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. భవిష్యత్తులో అవకాశం ఇస్తానని పేర్కొనగా గోవింద్‌ అసంతృప్తిగా వెళ్లిపోయినట్లు సమాచారం. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)