Breaking News

మమ్మల్నే స్టేషన్‌కు పిలిపిస్తావా?

Published on Sat, 12/20/2025 - 11:29

సాక్షి,అనంతపురం జిల్లా: ఉరవకొండ నియోజకవర్గ టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ఓ సీఐని పోలీసుస్టేషన్‌లోనే నానా దుర్భాషలాడారు. విశ్వసనీయ సమాచారం మేరకు... నియోజకవర్గంలోని ‘కీలక’ పోలీసుస్టేషన్‌లో ఓ కేసు విచారణ నిమిత్తం సీఐ గురువారం డోనేకల్లు గ్రామానికి చెందిన టీడీపీ నేతలు, మోపిడి గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడితో పాటు మరికొందరిని పిలిపించారు. దీన్ని జీర్ణించుకోలేని సదరు నాయకులు ఒక్కసారిగా సీఐ చాంబర్‌లోకి వెళ్లి దుర్భాషలాడారు. ‘నీకు తల తిరుగుతోందా?! మమ్మల్నే స్టేషన్‌కు పిలిపిస్తావా? లం.. కొడకా’ అంటూ రెచ్చిపోయారు. 

సీఐ చాంబర్‌లో సిబ్బందితో పాటు మరికొంత మంది వ్యక్తులు ఉన్నప్పటికీ వారు ఏమాత్రమూ వెనక్కి తగ్గకుండా దూషించారు. అనంతరం స్టేషన్‌ బయటకు వచ్చిన నేతలు ‘రేయ్‌.. ప్రభుత్వం మాది. మేం చెప్పినట్లు మూసుకుని వినండి. లేదంటే మీ తోకలు కత్తిరించి పోస్టింగ్‌ లేకుండా చేస్తాం. నా కొడకల్లారా’ అంటూ రెచ్చిపోయారు. ఈ ఘటనతో ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులకే చంద్రబాబు ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందని స్థానికులు చర్చించుకున్నారు. సీఐని దుర్భాషలాడిన నాయకులపై కేసుల నమోదుకు పోలీసులు సిద్ధమవుతుండగా.. కొంతమంది అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకుని సర్దిచెబుతున్నట్లు తెలుస్తోంది.

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)