Breaking News

రాజ్యాంగ నిర్మాతపై 'రాజ్యోన్మాదం'

Published on Fri, 08/09/2024 - 04:43

సాక్షి ప్రతినిధి, విజయవాడ:  సామాజిక అభ్యున్నతి ద్వారానే దళిత వర్గాల తలరాత మారుతుందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ నినదించి గురువారం నాటికి సరిగ్గా 95 ఏళ్లు. అణగారిన వర్గాలకు మద్దతుగా నాగ్‌పూర్‌లో 1930 ఆగస్టు 8న ఏర్పాటైన మహాసభకు దళితుల ఆరాధ్య దైవమైన అంబేడ్కర్‌ అధ్యక్షత వహించిన రోజే ఆ మహనీయుడి విగ్రహాన్ని లక్ష్యంగా చేసుకుని విజయవాడ నడిబొడ్డున రాష్ట్రానికి తలమానికంగా ఉన్న అంబేడ్కర్‌ విగ్రహంపై తెలుగుదేశం మూకలు ఉన్మాదంతో పేట్రేగిపోవడం దేశవ్యాప్తంగా యావత్‌ దళిత సమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది. 

స్వయంగా ప్రభుత్వమే పూనుకుని రాజ్యాంగ నిర్మాతపై దాడికి ఉన్మత్త మూకలను ప్రేరేపించడం దేశచరిత్రలో కనీవినీ ఎరుగని దారుణం. గురువారం రాత్రి కుట్రపూరితంగా అంబేడ్కర్‌ మహాశిల్పం చుట్టుపక్కల విద్యుత్‌ సరఫరా నిలిపివేయించి, సిబ్బందిని బయటకు తరలించి.. తెలుగుదేశం మూకలు భీంరావ్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడ్డాయి. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన కొందరు అధికారులు, పోలీసుల సమక్షంలో ఈ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ధ్వంసం చేసేందుకు బరితెగించారు. 

వీరి మాటలను బట్టిచూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్‌ ప్రోద్బలంతోనే ఎంపిక చేసిన కొందరు అధికారుల సమక్షంలో ఇదంతా జరిగినట్లు స్పష్టమవుతోంది. నిజానికి.. గత సీఎం వైఎస్‌ జగన్‌ దీనిపై ప్రత్యేక శ్రద్ధపెట్టి రూ.404.35 కోట్లతో అంబేడ్కర్‌ విగ్రహాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఆయన చేతుల మీదుగా ఈ ఏడాది జనవరి 19న జాతికి అంకితం చేశారు. అధికారంలోకి వచ్చింది మొదలు ‘పచ్చ’మూకలు దీనిపై కన్నేశారు. ఇందులో భాగంగానే పై నుంచి వచ్చిన ఆదేశాలతో గురువారం రాత్రి 9 గంటల తర్వాత పచ్చబ్యాచ్‌ రంగప్రవేశం చేసింది. 

అక్కడున్న వారందరినీ బలవంతంగా బయటకు పంపేశారు. అందులో పనిచేసే కొందరి సిబ్బంది ఫోన్లను లాకున్నారు. మరికొందరిని ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేసి వెళ్లిపోమని బెదిరించారు. ఈ తతంగానికి పోలీసులే కాపాలా కాశారు. విగ్రహం నలుమూలలా పహారా కాసి, చుట్టూ గేట్లు వేసి అనుకున్న పని మొదలుపెట్టారు. ఇంతలో ఈ సమాచారం బయటకు పొక్కింది. ప్రజలు, మీడియా, అంబేడ్కర్‌ ఆలోచనాపరులు రావడంతో వారంతా పరారయ్యారు. అధికారుల పర్యవేక్షణలోనే ఈ దారుణానికి తెగబడడం గమనార్హం. 

పట్టించుకోని సీపీ.. 
ఈ విషయాన్ని సీపీకి తెలిపేందుకు మీడియా ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదు. ఘటనా స్థలికి ఆయన హుటాహుటిన చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. రాష్ట్రానికే తలమానికంగా ఉన్న అంబేడ్కర్‌ విగ్రహంపై దాడి చేయడం దుర్మార్గం అని ఆయన మండిపడ్డారు. ఇలాంటి చర్యలు మంచివి కాదన్నారు. 

అలాగే, ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ప్రజాస్వామ్యవాదులు ముక్తకంఠంతో మండిపడుతున్నారు. మరోవైపు.. పచ్చమూకల దాడిలో అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటుకు గుర్తుగా అక్కడ ఏర్పాటుచేసిన బోర్డులో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరుతో ఉన్న స్టీల్‌ మెటల్‌ అక్షరాలు ధ్వంసమయ్యాయి. వీటిని సుత్తులతో కొట్టి మరీ ధ్వంసం చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 


సామాజిక అభ్యున్నతి ద్వారానే దళిత వర్గాల తలరాత మారుతుందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ నినదించి గురువారం నాటికి సరిగ్గా 95 ఏళ్లు. అణగారిన వర్గాలకు మద్దతుగా నాగ్‌పూర్‌లో 1930 ఆగస్టు 8న ఏర్పాటైన మహాసభకు దళితుల ఆరాధ్య దైవమైన అంబేద్కర్‌ అధ్యక్షత వహించిన రోజే ఆ మహనీయుడి విగ్రహాన్ని లక్ష్యంగా చేసుకుని విజయవాడ నడిబొడ్డున తెలుగుదేశం మూకలు ఉన్మాదంతో పేట్రేగిపోవడం దేశవ్యాప్తంగా యావత్‌ దళిత సమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది. 

స్వయంగా ప్రభుత్వమే పూనుకుని రాజ్యాంగ నిర్మాతపై దాడికి ఉన్మత్త మూకలను ప్రేరేపించడం దేశచరిత్రలో కనీవినీ ఎరుగని దారుణం. గురువారం రాత్రి కుట్రపూరితంగా అంబేద్కర్‌ మహాశిల్పం చుట్టుపక్కల విద్యుత్తు సరఫరా నిలిపివేయించి, సిబ్బందిని బయటకు తరలించి ... తెలుగుదేశం మూకలు  భీంరావ్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడ్డాయి. 



ఆ క్రమంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల గుండెల్లో చిరస్థానం ఏర్పరచుకున్న దళితజనబాంధవుడు జగన్‌మోహన్‌రెడ్డి పేరును మహాశిల్పం శిలాఫలకంనుంచి తొలగించడం ప్రజాస్వామ్య వాదులందరినీ తీవ్రంగా కలచివేసింది. సామాజిక, ఆరి్థక, రాజకీయ స్థాయుల్లో దారుణంగా విస్తరించిన అంటరానితనంపై ముఖ్యమంత్రిగా యుద్ధభేరి మోగించిన జగన్మోహన్‌ రెడ్డి పేరును మహనీయుడి పాదాల చెంత ఏర్పాటైన శిలాఫలకంనుంచి తుడిచివేయడం ద్వారా పచ్చమూకలు తాత్కాలిక పైశాచికానందాన్ని పొంది ఉండవచ్చు గాక... కానీ ‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ’ అని పరితపించిన జగనన్నను అణగారిన వర్గాల హృదయ ఫలకాలనుంచి తొలగించడం ఈ ఉగ్రవాద తండాలకు సాధ్యమయ్యే పనేనా?   

Videos

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)