Breaking News

మహిళా సబ్‌ రిజిస్ట్రారును బెదిరించిన టీడీపీ నేత

Published on Tue, 08/08/2023 - 06:00

ప్రొద్దుటూరు : టీడీపీ మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు సబ్‌ రిజిస్ట్రార్‌ రామలక్షుమ్మను బెదిరించారు. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో వరదరాజులరెడ్డి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి సబ్‌ రిజిస్ట్రార్‌తో పాటు సిబ్బందిని బయటికి రావాలని బెదిరించారు. అయితే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం లోపలే ఉండి బయటికి రాలేనని బోరున విలపించారు.

మీకూ ఆడ పిల్లలున్నారు కదా.. అని ఆమె ప్రాధేయపడ్డారు. రాజకీయాలతో తమకేం సంబంధం లేదని తెలిపారు. అయినా వినకుండా వరదరాజులరెడ్డి.. నువ్వు ఏడ్చినా వదిలేదిలేదు.. బయటకు రావాల్సిందే.. అంటూ భయభ్రాంతులకు గురిచేశారు. విధిలేని పరిస్థితిలో సబ్‌ రిజిస్ట్రార్‌ ఏడ్చుకుంటూ బయటకొచ్చారు. మహర్షి స్కూల్‌ స్థలం రిజిస్ట్రేషన్‌కు సంబంధించి వరద చెప్పినట్టు సబ్‌ రిజిస్ట్రార్‌ వినలేదు.

నిబంధనలకు వ్యతిరేకంగా ఉండటంతో సబ్‌ రిజిస్ట్రార్‌ దానిని రిజిస్టర్‌ చేయకపోవడంపై వరదరాజులరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలో ఆస్తుల అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి కప్పం కట్టాలా అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దాదాపు అరగంట పాటు విధులకు ఆటంకం జరిగి లావాదేవీలు నిలిచిపోయాయి.

ఏదైనా సమస్య ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాల్సింది పోయి ఏకంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ సిబ్బందిని బెదిరించి విధులకు ఆటంకం కలిగించడమేంటని అక్కడివారు ప్రశ్నిస్తున్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)