Breaking News

నకిలీ మద్యం కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. జనార్థన్‌ ఫోన్‌ ఎక్కడ?

Published on Sun, 10/12/2025 - 11:13

సాక్షి, అమరావతి: ఏపీలో నకిలీ మద్యం(AP Liquor case) కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. నకిలీ మద్యం కేసులో టీడీపీ(TDP) గ్యాంగ్‌.. సాక్ష్యాలను దాచే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఈ కేసులో ప్రధాని నిందితుడు, టీడీపీ నాయకుడు జనార్థన్‌ రావు ఫోన్‌ మిస్సింగ్‌ అని కొత్త కోణాన్ని తెర మీదకు తెచ్చారు. ఈ నేపథ్యంలో కీలక ఆధారాలను దాచే ప్రయత్నం జరుగుతోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, నకిలీ మద్యం కేసులో టీడీపీ నాయకుడు జనార్ధన్ రావును(Janardhan Rao) అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఫోన్ గురించి పోలీసులు(AP Police) ఆరా తీశారు. అయితే, ఆఫ్రికా నుంచి వస్తుండగా తన ఫోన్ ముంబై ఎయిర్‌పోర్టులో పోయిందని జనార్ధన్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో జనార్ధన్ పేరుతో మరో సిమ్ తీసుకునేందుకు ఎక్సైజ్ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. జనార్ధన్ ఫోన్ కాల్ డేటాను కనుక్కోవడానికి అధికారుల ప్లాన్‌ చేస్తున్నారు. ఇక, జనార్థన్‌ రావు ఫోన్ దొరికితే మరికొందరు టీడీపీ నాయకులు బయటికి వచ్చే అవకాశం ఉంది. ఆయన ఫోన్‌లో ఆర్థిక లావాదేవీల వివరాలు కూడా ఉండే అవకాశం ఉందని  ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. కానీ, ముంబై ఎయిర్‌పోర్టులో ఫోన్‌ పోయిందనే ఆయన వ్యాఖ్యలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

టీడీపీ సిండికేట్‌..
ఇదిలా ఉండగా.. 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక  టీడీపీ సిండికేట్‌ ద్వారా సాగిస్తున్న మద్యం దోపిడీ బహిరంగ రహస్యమే. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని తొలగించి మొత్తం 3,396 మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్‌కు కట్టబెట్టింది. పర్మిట్‌ రూమ్‌లకు అనుమతులిచ్చింది. 75 వేల బెల్ట్‌ దుకాణాలు ఏర్పాటు చేసినా ఉదాసీనంగా ఉంటోంది. 540 బార్లను (త్వరలో మరో 300 బార్లు కూడా) టీడీపీ సిండికేట్‌కు కట్టబెట్టింది. ఇలా రాష్ట్రంలో మద్యం నెట్‌వర్క్‌ను టీడీపీ సిండికేట్‌ గుప్పిటపట్టింది. అనంతరం జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు, జనార్దన్‌రావు ఆధ్వర్యంలో ఆఫ్రికా మోడల్‌ నకిలీ మద్యం యూనిట్లను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసింది.

టీడీపీ సీనియర్‌ నేతలకు ప్రాంతాలవారీగా పంపిణీ బాధ్యతలు అప్పగించింది. నకిలీ మద్యాన్ని ప్రభుత్వ లైసెన్స్‌ పొందిన ప్రైవేటు మద్యం దుకాణాలు, పర్మిట్‌ రూమ్‌లు, బార్లు, బెల్ట్‌ షాపుల్లో దర్జాగా విక్రయిస్తూ భారీ దోపిడీకి తెగబడుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తొలి ఏడాదిలోనే రూ.5,280కోట్లు కొల్లగొట్టిన ఈ మద్యం మాఫియా వచ్చే నాలుగేళ్లలో మరో రూ.40 వేల కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధపడింది. అందులో 30 శాతం వాటా కరకట్ట బంగ్లాకే ముడుపులుగా చెల్లించాలన్నది డీల్‌. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)