Breaking News

చినబాబు బాధితుడే బ్లాక్‌‘మెయిలర్‌’

Published on Tue, 08/05/2025 - 03:37

సాక్షి, అమరావతి: డ్యామిట్‌ కథ అడ్డం తిరిగిందంటే ఇదే.. సింగపూర్‌ ప్రభుత్వంలోని అందరికీ ఏపీతో ఒప్పందాలు చేసుకోవద్దంటూ మురళీకృష్ణ అనే వ్యక్తి ఈ–మెయిల్స్‌ పంపించాడని, అతను వైఎస్సార్‌సీపీకి చెందిన వ్యక్తి అని చినబాబు ఇటీవల శివాలెత్తిపోయారు. అయితే ఈ వ్యవహారంపై సింగపూర్‌ కంపెనీల ఫిర్యాదుతో పెదబాబు చేపట్టిన పోస్టుమార్టంలో నిర్ఘాంతపోయే వాస్తవాలు బట్టబయలయ్యాయి. ఈ–మెయిల్స్‌ పంపించి సింగపూర్‌లో రాష్ట్రం పరువు తీసింది చినబాబు బాధితుడేనని తేలింది. దీంతో పెదబాబు చినబాబుకు తలంటారు. అయితే అవన్నీ తనకు తెలీకుండా జరిగాయని తనయుడు చల్లగా జారుకోవడంతో సింగపూర్‌లో పరువుమొత్తం పోయిందంటూ పెదబాబు గగ్గోలు పెడుతున్నట్టు సమాచారం.  

పెదబాబు పోస్టుమార్టంలో తేలిందేమంటే..! 
చిలకలూరిపేటకు చెందిన మురళీకృష్ణ అమెరికాలో ఉంటారు. చిలకలూరి పేటలో తనకు ఉన్న భవనం సెటిల్‌మెంట్‌ కోసం ఆయన చినబాబు అపాయింట్‌మెంట్‌ కోసం యతి్నంచారు. మంత్రి ప్రైవేట్‌ బృందంలోని ఎ.వంశీని సంప్రదిస్తే  అపాయింట్‌మెంట్‌కు రూ.38 లక్షలు, భవనం సెటిల్‌మెంట్‌కు రూ.కోటికి బేరసారాలు నడిపారు. దీంతో మురళీకృష్ణ అపాయింట్‌మెంట్‌ కోసం రూ.38 లక్షలు వంశీ ఖాతాకు జమ చేశారు. చివరకు చినబాబు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో  మురళీకృష్ణ కడుపు మండింది. ఆగ్రహంతో సింగపూర్‌ ప్రభుత్వానికి, కంపెనీలకు ఏపీ సర్కారుకు వ్యతిరేకంగా ఈ–మెయిల్స్‌ పంపించారు.  

మెయిల్స్‌ చూపించి నిలదీసిన సింగపూర్‌ ప్రభుత్వ కంపెనీలు  
ఆంధ్రప్రదేశ్‌లో పాలకులు అపాయింట్‌మెంట్లకూ లంచాలు తీసుకుంటారని మురళీకృష్ణచేసిన మెయిల్స్‌ను పెదబాబుకు చూపించి సింగపూర్‌ కంపెనీలు నిలదీశాయి. మీ పరిపాలన ఇలా ఉంటే ఎలాగని, పెట్టుబడులు పెట్టేందుకు తాము వస్తే తమకూ అపాయింట్‌మెంట్లు అమ్మరని గ్యారెంటీ ఏమిటని ప్రశి్నంచినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో పెదబాబు ఈ మెయిల్స్‌ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని కూపీ లాగితే చినబాబు అవినీతి డొంక కదిలినట్టు సమాచారం.  దీనిపై చినబాబుతోపాటు ఆయన ప్రైవేటు బృందానికీ పెదబాబు తలంటినట్టు తెలుస్తోంది.  

చినబాబు బాధితుడే బ్లాక్‌‘మెయిలర్‌’
తొలి నుంచి చినబాబు చిల్లర టీమ్‌పై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇటీవల మంత్రి అపాయింట్‌మెంట్‌ కోసం సంప్రదించిన పదిమంది పారిశ్రామికవేత్తల వద్ద కూడా అతని బృందం డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. చివరకు   అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా చినబాబు బయటకు వెళ్లిపోవడంతో పారిశ్రామిక వేత్తలు కరకట్ట క్యాంపులో రచ్చరచ్చ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చినబాబు అపాయింట్‌మెంట్‌ లంచాల వ్యవహారం అధికారపార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)