Breaking News

AP: టీడీపీ నిర్వాకం.. డూప్లి‘కేట్స్‌’..!

Published on Tue, 12/12/2023 - 04:51

ఈ ఫొటోలోని చండ్ర సరళ ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి పదవిలో ఉన్నారు.
2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో తెనాలి మున్సిపాలిటీ 31వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓడిపోయారు.
ఈమె నెల్లూరు జిల్లా పామూరుపల్లి కోడలు.
అయితే పుట్టినిల్లైన తెనాలిలోనూ ఆమెకు ఓటుంది.
ఇంటి పేరు మార్పుతో రెండు చోట్లా ఓటరుగా కొనసాగుతున్నారు. 
జాస్తి సరళ పేరుతో తెనాలిలో ఓటరుగా నమోదు చేసుకోగా చండ్ర సరళ పేరుతో పామూరుపల్లిలో ఓటు హక్కు పొందారు. 


 

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఓటూ ఎంతో కీలకం! ఒకే ఒక్క ఓటు సైతం అభ్యర్థుల తలరాతలను తారుమారు చేస్తుంది! గెలుపోటములను నిర్దేశిస్తుంది! ఒకపక్క ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయంటూ గగ్గోలు పెడుతున్న విపక్ష టీడీపీ మరోపక్క చాపకింద నీరులా దొంగ ఓట్ల నమోదుకు బరి తెగించింది. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉద­య­గిరి నియోజకవర్గంలో టీడీపీ మద్దతుదారుల దొంగ ఓట్ల బాగోతం బహిర్గతమైంది. పలువురు వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాల్లోనూ ఓటర్లుగా నమోదైనట్లు గుర్తించారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఓటర్ల జాబితా పరిశీలన, నమోదు, తొలగింపు, సవరణ లాంటి కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాల్లో టీడీపీకి చెందిన పలువురు రెండు చోట్ల ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు బయటపడింది. 

అక్కడా ఉంటారు.. ఇక్కడా ఉంటారు!
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలోని పామూరుపల్లి 300 ఓటర్లు ఉండే చిన్న గ్రామం. అక్కడ టీడీపీ మద్దతు­దారులకు సంబంధించి 30 ఓట్ల  డబుల్‌ ఎంట్రీ వ్యవహారం తాజాగా బయటపడింది. గ్రామంలో ఓటు హక్కు ఉన్న చింతగుంపల ప్రసాద్, చింతగుంపల అరుణ, చింతగుంపల ముఖేష్‌కు కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండలం రాచెరు­వు­రాజుపాలెం గ్రామంలోనూ ఓటర్లుగా నమోద­య్యారు. చండ్ర చలపతిరావు, చండ్ర సరళకు పా­మూరుపల్లిలో పాటు తెనాలిలోనూ ఓట్లు ఉన్నా­యి. చండ్ర ఈశ్వరమ్మకు వరికుంటపాడులోనే రెండు చోట్ల ఓట్లు ఉండటం గమనార్హం. వివాహమై అత్తా­రింటికి వెళ్లిన కొందరు మహిళలకు అటు మెట్టినిం­ట్లో­ను, ఇటు పుట్టింటిలోనూ 2 చోట్ల ఓట్లున్నాయి. 
 

సోమిరెడ్డి – నారాయణ కుట్రలు
► సర్వేపల్లి నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాలలో 11,291 మంది వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు మాజీ మంత్రి సోమిరెడ్డి తన అనుచరులతో ఫారం–7 ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయించారు. వెరిఫికేషన్‌ సమయంలో అనుమానం రావడంతో పరిశీలించగా టీడీపీ నేతలు కుట్ర పన్నినట్లు వెలుగులోకి వచ్చింది. 

► ఇదే తరహాలో నెల్లూరు నగరంలో దాదాపు 12 వేల ఓట్లను తొలగించేందుకు మాజీ మంత్రి పొంగూరు నారా­యణ టీమ్‌ ప్రయత్నించింది. వైఎ­స్సార్‌సీపీ మద్దతుదారుల ఓట్లను ఆన్‌­లైన్‌లో ఫారం–7 ద్వారా తొలగించేందుకు దరఖాస్తు చేయించారు. అయితే నెల్లూరు కార్పొరేషన్‌ నుంచి సంబంధిత ఓటర్లకు సమాచారం వెళ్లడంతో ఈ కుట్రలు విఫలమయ్యాయి. నెల్లూరు నగర నియోజకవర్గం జనార్దన్‌రెడ్డి కాలనీ పోలింగ్‌ బూత్‌ నెంబర్‌ 10లో గౌస్‌బాషా వైఎస్సార్‌సీపీ మద్దతు­దారుడు కావడంతో అతడి ఓటును తొలగించేందుకు ఎల్లో గ్యాంగ్‌ ఆన్‌లైన్‌­లో ఫారం–7 ద్వారా దరఖాస్తు చేసింది. బూత్‌ నెంబర్‌ 9లో ఎస్‌ మస్తాన్, పెల్గగరి దేవయానం మృతి చెందినట్లు పేర్కొంటూ ఓటర్లుగా తొలగించేందుకు ఫారం–7 ద్వారా దరఖాస్తు చేశారు.  

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)