Breaking News

కేసులపై కుతంత్రం!

Published on Tue, 12/17/2024 - 03:07

చంద్రబాబుపై కొనసాగు­తున్న కేసులను ఎత్తేద్దాం..! విపక్ష ప్రజా ప్రతి­నిధులపై అక్రమ కేసులు పెట్టేద్దాం!! ఇదీ కూటమి సర్కారు కుట్రల కుతంత్రం! 

ఒకపక్క ఎలాంటి ఆధారాలు లేకపోయినా వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు బనాయిస్తూ మరోవైపు స్పష్ట­మైన ఆధారాలతో బాబుపై కోర్టుల్లో కొనసాగుతున్న కేసుల విచారణను నీరు­గార్చి అటకెక్కించేందుకు కూటమి సర్కార్‌ సిద్ధమైంది. 

ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ నుంచి వచ్చిన ఓ ప్రముఖ సీనియర్‌ న్యాయవాది ఏకంగా పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులతో సమావేశమై స్కిల్‌స్కామ్, అసైన్డ్‌ భూముల దోపిడీ, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ అక్రమాలు, ఫైబర్‌ నెట్‌ కుంభకోణం కేసుల నుంచి చంద్రబాబు పేరును తప్పించడంపై మార్గనిర్దేశం చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. ఆ కేసుల్లో సాక్షులను ఎలా వేధించాలి..? ఎలా తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయాలి..? న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా ఎలాంటి అడ్డదారులు తొక్కాలి? అనే విషయాలను  ఆ సీనియర్‌ న్యాయవాది కూలంకషంగా ఉద్బోధించినట్లు తెలుస్తోంది.

చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసులను మూసివేయడమే ఏకైక అజెండాగా ఓ ప్రైవేట్‌ న్యాయవాది ఈ సమావేశాన్ని నిర్వహించడం.. రానున్న రెండు నెలల్లోనే ఆ కేసులను క్లోజ్‌ చేసేలా పోలీసు, సీఐడీ వ్యవస్థలను సిద్ధం చేయడంపై పోలీస్‌ వర్గాల్లో కలకలం రేపుతోంది. నేడు కూడా ఈ సమావేశాన్ని కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒకవైపు తమపై ఉన్న కేసులను నీరుగారుస్తున్న ప్రభుత్వ పెద్దలు మరో వైపు విపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించే వ్యూహాన్ని రచించారు. 

వైఎస్సార్‌సీపీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, పీవీ మిథున్‌రెడ్డిపై మద్యం అక్రమ కేసులను బనాయించేందుకు కుతంత్రం పన్నారు. ‘ముఖ్య’ నేత ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐడీ ఉన్నతాధికారి ఒకరు బెవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఆ ఇద్దరినీ అక్రమ కేసులతో వేధిస్తే డీజీపీ పోస్టు ఇస్తానని సీఐడీ ఉన్నతాధికారికి ‘ముఖ్య’ నేత ఆఫర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది!!   
– సాక్షి, అమరావతి 

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)