Breaking News

చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించండి 

Published on Wed, 09/13/2023 - 04:16

సాక్షి, అమరావతి: చంద్రబాబు అరెస్టయినా జాతీయ పార్టీల నాయకులు ఎవరూ పట్టించుకోకపోవడంతో టీడీపీ నేతలు రంగంలోకి దిగి ఎలాగైనా వారితో మాట్లాడించేందుకు విశ్వ ప్రయ­త్నాలు చేస్తున్నారు. టీడీపీ నేతలు లాబీయింగ్‌ చేసి మరీ స్పందించాలని కోరడంతోనే పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్, అకాలీదళ్‌ నేత సుఖబీర్‌సింగ్‌ బాదల్‌ స్పందించినట్టు తెలుస్తోంది.

40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు అరెస్టయి నాలుగురోజులైనా ఆయనకు జా­తీ­య స్థాయిలో కనీసమద్దతు లభించలేదు. ఎవరూ స్పందించకపోవడంతో పలువురు టీడీపీ నేతలు రంగంలోకి దిగి ఢిల్లీ స్థాయిలో జాతీయ పార్టీల నేతలతో లాబీయింగ్‌ చేస్తున్న­ట్టు సమాచారం. చంద్రబాబు అనుయాయుడు కంభంపాటి రామ్మోహనరావు ఢిల్లీలో తనకు తెలిసిన వారందరినీ కలిసి చంద్రబాబు అరెస్ట్‌­పై మాట్లాడాలని కోరుతున్నట్టు తెలిసింది.

తన­కు తెలిసిన ఎంపీల ద్వారా మమతా బెనర్జీని బతిమలాడటంతో ఆమె మొక్కుబడిగా స్పందించారు. అఖిలేశ్‌ను కూడా టీ­డీపీ నేతలు ఒత్తిడి చేయడంతో ఆయన ట్వీట్‌ చేసిన­ట్టు తెలుస్తోంది. సుఖబీర్‌సింగ్‌ బాదల్‌ కూడా లా­బీ­యింగ్‌ వల్లే మూడురోజుల తర్వాత స్పందించారు.  

పట్టించుకోని జాతీయ పార్టీలు 
వివిధ జాతీయపార్టీలు, నేతలతో చంద్ర­­బాబు­కు సంబంధాలున్నాయి. ఉమ్మడి రాష్ట్రం­లో ముఖ్య­మంత్రిగా ఉండగా జాతీయ రాజకీయా­ల్లో ఆయన క్రియాశీలకంగా పనిచేశారు. జాతీ­య రాజకీయాలను ఎప్పుడూ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు, అవకాశవాదం కోసం ఉపయోగించడంతో ఆయన నమ్మదగని నేతగా ముద్రపడ్డారు.

ప్రస్తుతం అన్ని పార్టీలు ఆయన్ను దూరం పెట్టాయి. అటు ఎన్డీయే దగ్గరకు రానీయడం లేదు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి కూడా ఆయన్ను పట్టించుకోవడం లేదు. ఏ కూటమిని అయినా తన రాజకీయ అవసరాల కోసమే వాడుకోవడంతో ఇప్పుడు ఆయన దేశ రాజకీయాల్లో ఏకాకిగా మారిపోయారనే వాదన వినిపిస్తోంది. 

మద్దతు కోసం ఢిల్లీలో లాబీయింగ్‌ 
చంద్రబాబు అనుయాయుడు కంభంపాటి, బీజేపీలోని ఆయన కోవర్టులు సీఎం రమేష్, సుజనాచౌదరి వంటి నేతలు చంద్రబాబుకు అను­కూలంగా లాబీయింగ్‌కు దిగారు. అయినా ఆశించినస్థాయిలో జాతీయనేతలు చంద్రబాబు­కు మద్దతు పలకలేదు. కనీసం మరికొంత మందితో అయినా ట్వీట్లు చేయించాలనే ఉద్దేశంతో ఢిల్లీలో తంటాలు పడుతున్నట్టు తెలుస్తోంది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)