Breaking News

ఇదేం ఖర్మ! స్పందన లేకపోవడంతో కంగు­తిన్న చంద్రబాబు.. హడావుడిగా

Published on Fri, 04/14/2023 - 04:23

సాక్షి, అమరావతి: చంద్రబాబు సభలకు జనాన్ని రప్పించ­డం ఆ పార్టీ నేతలకు పెద్ద సవాల్‌గా మారింది. టీడీపీ తన అడ్డాగా చెప్పుకునే విజయవాడలో చంద్రబాబు పర్య­ట­నకు ప్రజల నుంచి స్పందన కరువైంది. ఆ పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయ­వాడ తూర్పు నియోజకవర్గంలో పరిస్థితి ఇదీ! టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బుధవారం విజయవాడ­లోని రాణీగారితోట ప్రాంతంలో రోడ్‌షో నిర్వహించగా కనీ­సం ఆ ప్రాంతలోని ప్రజలు కూడా ఆయన్ను పట్టించుకోలేదు. దీంతో కంగు­తిన్న చంద్రబాబు హడావుడిగా నిష్క్రమించారు.

ఆ తర్వాత బందరు వెళుతూ కానూరు, పోరంకి ప్రాంతాల్లో నిర్వహించిన రోడ్‌షోల్లోనూ ఇదే పరి­స్థితి ఎదురైంది. విజయవాడ, పెనమలూరు నియోజకవర్గాల పరిధిలో చంద్రబాబు రోడ్‌షోలు ప్లాప్‌ కావడంతో బెజవాడ టీడీపీ నేతలు మొహాలు వేలాడేశారు. గేరు మార్చామంటూ చంద్రబాబు, టీడీపీ నేతలు కొద్దిరోజులుగా చేస్తున్న ప్రచారంలో పస లేదని విజయవాడ పర్యటనతో తేటతెల్లమైందని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.  

బందరులో మాడిపోయిన బాబు మొహం
మచిలీపట్నంలో చంద్రబాబుకు టీడీపీ కార్యకర్తలు మరో షాక్‌ ఇచ్చారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలతో స్వాగ­తం పలికి నినాదాలు చేయడంతో మచిలీ­పట్నం సభ చంద్ర­బాబును ‘ఇదేం ఖర్మ’ అను­కునేలా చేసింది. సభకు జనం ఆశి­ంచిన స్థాయిలో రాక­పో­వ­డంతో బాబు మొహం మాడి­పో­యింది.

నాయ­కు­లకు ఇండెంట్లు ఇచ్చి మరీ జన సమీక­రణకు ప్రణాళిక రూ­పొందించినా స్పందన కరువవడంతో ఇరుకు సందులను ఎంచుకుంటున్నారు. టీడీపీ నేతలు ఫేక్‌ ప్రచా­రానికి ఎల్లో మీడియా, సోషల్‌ మీడియాను ఉపయోగించుకుంటు­న్నా­రు. చంద్రబాబు పర్యటనలు, లోకేశ్‌ పాద­యా­త్రకు స్పందన కొరవడటంతో ప్రజలను నమ్మించేందుకు ఆపసో­పా­లు పడుతున్నారు.

ఇన్‌చార్జ్‌లు కరువు
టీడీపీకి జనాదరణ లేదని గ్రహించడంతో చాలా నియోజక­వ­ర్గాల్లో ఆ పార్టీకి ఇన్‌చార్జిలు లేకుండా పోయారు. సుమారు 52 నియోజకవర్గాలకు టీడీపీ ఇన్‌చార్జిలు లేరు. మరో 38 చోట్ల 3వ స్ధానానికి పరిమితం కావాల్సిన పరిస్థితి ఉంది. గన్నవరం, కైకలూ­రులో నాయకులు ఎవరో తెలియని దుస్థితి. విజ­యవాడ పశ్చిమ నియోజక­వర్గంలో ఎంపీ కేశి­­నేని నానిని ఇన్‌చార్జిగా ప్రకటించినా ఆయన్ను వ్యతిరేకించే నేతలు ఒప్పు­కోవ­డం లేదు.

నూజివీడు, గుడి­వాడలో పార్టీ పరి­స్థితి అంతా అయోమయం. గుంటూరు జిల్లాలో సత్తె­న­పల్లికి ఇన్‌చార్జి లేరు. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూ­రులోని పూతల­పట్టు, చిత్తూరు నియోజవర్గాల్లో పార్టీని నడిపించే నాథుడే లేడు. అనంతపురం జిల్లా­లోని శింగనమల, మడకశిరలో టీడీపీకి అభ్యర్థులే దొరకలేదు.   

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)