Breaking News

‘సెల్‌ ఫోన్‌’తో సొల్లు కథ

Published on Tue, 08/06/2024 - 05:35

మంత్రి అనగాని సత్యప్రసాద్, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో ఆ పార్టీ నేతల పేకాట, కోడి పందేల కేంద్రాల వ్యవహారాన్ని మరుగున పరిచేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఇతర టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారన్న విషయం విస్పష్టంగా బయటపడింది. చిన్న లాజిక్‌ మిస్సయిన టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు.  – సాక్షి ప్రతినిధి, బాపట్ల

నగరం మండలం వెలమవారిపాలెంలో ఇటీవల ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి పేకాట కేంద్రంలో రోజుకు కోట్లలో ఆట ఆడిస్తున్నారు. ఈ ఒక్క కేంద్రం నుంచే స్థానిక టీడీపీ నేతకు నెలకు రూ. 60 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. దీనిని స్థానిక పోలీసుల సహకారంతో నడిపిస్తున్నారు. ఈ కేంద్రాల బారిన పడి వందలాది మంది ఆరి్థకంగా చితికిపోతున్న విషయాన్ని వైఎస్సార్‌సీపీ నేత వరికూటి అశోక్‌బాబు బయటపెట్డడంతో టీడీపీ నేతలు బహిరంగ సవాళ్లు విసిరారు. పోలీసులు అశోక్‌బాబును గృహ నిర్బంధం చేయగా, టీడీపీ నేత సాయిబాబు, ఆయన అనుచరులు భట్టిప్రోలులో టీడీపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున చేరారు. వారిని నిలువరించే సందర్భంలోనే పోలీసులపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు.

నగరం ఎస్సైని టీడీపీ కార్యకర్త చొక్కా పట్టుకొని నెట్టిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. దీంతో ఉలిక్కిపడిన అధికార పార్టీ నేతలు దాని నుంచి తప్పించుకునేందుకు అది ఫేక్‌ అంటూ ఓ సెల్‌ ఫోన్‌ కథ అల్లారు. వాస్తవంగా ఈ ఘర్షణను వీడియో తీసింది టీడీపీ నేతలే. గొప్ప కోసం వారు సోషల్‌ మీడియా గ్రూపుల్లో పెట్టుకున్నారు. టీడీపీ కార్యకర్త నగరం ఎస్‌ఐ చొక్కా పట్టుకోవడం, వారిద్దరి పెనుగులాట వాటిలో స్పష్టంగా ఉంది.

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ ఇతర టీడీపీ నేతలు మాత్రం ఆ వీడియోను ఎడిట్‌ చేసి, కొత్త కథ అల్లారు. సెల్‌ ఫోనుకిందపడితే టీడీపీ కార్యకర్త తీసి ఇవ్వబోయాడంటూ కట్టుకథ అల్లారు. కలెక్టర్ల సమావేశంలోనూ సీఎం చంద్రబాబు ఎడిట్‌ చేసిన వీడియో క్లిప్‌ను చూపించి సాక్షి మీడియా, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీపై బురద జల్లే ప్రయత్నం చేశారు. సెల్‌ కిందపడితే కిందికి వంగి తీసివ్వాలి తప్ప ఎస్సైతో పెనుగులాడాల్సిన అవసరం ఏముందన్న వాస్తవాన్ని వారు మరిచారు.

పైగా, నలుగురు పోలీసుల మధ్య నుంచి టీడీపీ కార్యకర్త దూరి మరీ ఎస్సై చొక్కా పట్టుకొన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. వీటన్నింటినీ మరుగునపెట్టి, పేకాట, కోడిపందాల వ్యవహారాన్ని తొక్కి పెట్టేందుకే చంద్రబాబు, లోకేశ్‌ కొత్త డ్రామాకు తెరలేపినట్లు టీడీపీ వారి వీడియోలను పరిశీలిస్తే స్పష్టంగా అర్థమవుతుంది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)