Breaking News

మంత్రి అనగాని ఇలాకాలో శ్రుతిమించిన దౌర్జన్యం

Published on Tue, 06/25/2024 - 04:37

సాక్షి ప్రతినిధి, బాపట్ల: అధికారం అండతో టీడీపీ నేతలు పేట్రేగిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. వాహనాలను తగు­లబెడుతున్నారు. కులం పేరుతో దూషిస్తున్నా­రు. ఊరు  వది­లిపోవాలని హెచ్చరిస్తు­న్నారు. వెళ్లనివారిపై దాడులు చేసి కొడుతున్నారు. తీవ్రంగా గాయపరుస్తున్నారు. నాయకులపై దాడులు చేయ­డంతోపాటు వారి ఆస్తులకు నష్టం చేస్తున్నారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ సొంత ఇలాకా రేపల్లె నియోజకవర్గంలో ఈ తరహా దాడులు పెచ్చుమీరాయి.

ఆదివారం రాత్రి చెరుకుపల్లి మండలం రాంబోట్లవారిపాలెంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ నాయకుడు చేబ్రోలు రాజ్‌కుమార్‌ ఇంటిపై 30 మందికిపైగా టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాడ్లు తదితర మారణాయుధాలతో దాడిచేశారు. రాజ్‌కుమార్‌ను కులం పేరు పెట్టి రాయ­లేని పదజాలంతో దూషించారు. మాకు వ్యతి­రేకంగా పనిచేస్తావా..? అంటూ దాడిచేసి తీవ్రంగా కొట్టారు. బయటకు లాక్కొచ్చి ఇంటిమెట­్లపైన, ఇంటిముందున్న ఇసుక దిబ్బపైన పడేసి మళ్లీమళ్లీ కొట్టారు. దాడివిషయం తెలుసుకున్న అతడి బంధువులు అక్కడికి చేరుకోవడంతో రాజ్‌కుమార్‌ కొనప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన రాజ్‌కుమార్‌ను తొలుత రేపల్లె ఆస్పత్రికి తరలించారు. తరువాత తెనాలి ఆస్ప­త్రిలో చేర్చారు.

తనను ఊరువదలి వెళ్లిపోవాలని టీడీపీ కార్యకర్తలు హెచ్చరించారని రాజ్‌కుమార్‌ తెలిపారు. రాం»ొట్లవారిపాలెం, పగడంవారిపాలెం, పిట్టుకోటిరెడ్డిపాలెం గ్రామాలకు చెందిన 30 మందికిపైగా టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాడ్లు తదితర మారణాయుధాలతో దాడి చేసినట్లు బాధితుడు సోమవారం జిల్లా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత ప్రసాదరెడ్డిని టీడీపీ మూకలు బెదిరిస్తు­న్నాయి.

చెరుకుపల్లి మండలం ఆరుంబాక గ్రామా­­నికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు, న్యాయవాది కర్ర ప్రతాప్‌ ఇంటిపై దాడిచేసి ఆయన ద్విచక్రవాహనాన్ని ధ్వంసం చేశారు. గుళ్లపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటుచేసిన శిలాఫలకాలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశా­రు. నిజాంపట్నం మండలం అడవులదీవి సర్ప­ంచ్‌ ఏమి­నేని రాంబాబు ఇంటిపై దాడిచేసి కిటికీ అద్దాలు పగులగొట్టారు. నియోజకవర్గవ్యాప్తంగా టీడీపీ నేతలు.. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను ఊర్లు వదలివెళ్లాలని నిత్యం బెదిరిస్తున్నారు.

Videos

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)