Breaking News

లిక్కర్‌ సిండికేట్‌కు సంక్రాంతి కిక్కు!

Published on Mon, 01/12/2026 - 04:53

సాక్షి, అమరావతి: ప్రభుత్వ జీవోతో మాకేం సంబంధం లేదు.. ప్రభుత్వమే మాది.. మా దోపిడీని ఆపేదెవర్రా.. అన్నట్లుంది రాష్ట్రంలో టీడీపీ మద్యం సిండికేట్‌ బరితెగింపు. మద్యం ధరల పెంపుపై ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు (జీవో) విడుదల కాకముందే రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేసి, మూడు రోజులుగా అనధికారికంగా దోపిడీకి తెగబడుతున్నారు. అందుకు ఎక్సైజ్‌ అధికారులు అడ్డుకోకుండా చూస్తామని చెప్పి.. టీడీపీ కూటమి ప్రజా ప్రతినిధులు సంక్రాంతి సీజన్‌ వేళ మద్యం దుకాణాల నుంచి భారీగా మామూళ్లు వసూలు చేశారు. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచుతూ ఈ నెల 8న రాష్ట్ర మంత్రి మండలి తీర్మానించింది. 

ఒక్కో బాటిల్‌పై రూ.10 పెంపునకు నిర్ణయించింది. కాగా, అందుకు అనుమతినిస్తూ అధికారికంగా జీవో ఇంకా విడుదల కాలేదు. అంటే మద్యం ధరల పెంపు అధికారికంగా ఇంకా అమలులోకి రాలేదు. కానీ ఈ అధికారిక ప్రక్రియతో తమకు సంబంధం లేదంటూ మద్యం సిండికేట్‌ బరితెగించింది. ఈ నెల 9 నుంచే మద్యం ధరలు పెంచేసింది. మూడు రోజులుగా రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్లలో ధరల పెరుగుదల అనధికారికంగా అమలులోకి వచ్చేసింది. ‘ముఖ్య’ ప్రజా ప్రతినిధి దన్ను ఉండటంతో ఎక్సైజ్‌ శాఖ చోద్యం చూడటం మినహా ఏమీ చేయలేక పోతోంది.

సంక్రాంతి స్పెషల్‌ 
బాటిల్‌పై రూ.10 అదనం అంటే ఏముందీలే అనుకోవద్దు. ఎందుకంటే రాష్ట్రంలో 3,636 మద్యం దుకాణాలు, 540 బార్లు ఉన్నాయి. వాటిలో నెలకు 6 లక్షల కేసుల వరకు మద్యం విక్రయిస్తున్నారు. రోజుకు దాదాపు రూ.100 కోట్ల మద్యం విక్రయాలు సాగుతున్నాయి. అనధికారికంగా బాటిల్‌పై రూ.10 పెంపుదలతో రోజుకు రూ.5 కోట్లు చొప్పున అనధికారికంగా కొల్లగొడుతున్నారు. ఇలా మూడు రోజులుగా రూ.15 కోట్ల వరకు దందా సాగించారు. 

ఇక సంక్రాంతి సీజన్‌ను సొమ్ము చేసుకునేందుకు మద్యం సిండికేట్‌.. బెల్ట్‌ దుకాణాల్లో మరో రూ.5 అదనంగా పెంచింది. అందుకోసమే ఏకంగా 75 వేల వరకు బెల్ట్‌ దుకాణాలను బరితెగించి మరీ ఏర్పాటు చేసింది. మద్యం ధర పెంపు జీవో వచ్చిన తర్వాత కూడా అధికారిక పెంపుదల రూ.10తోపాటు అనధికారికంగా మరో రూ.10 పెంపుదలకు సిండికేట్‌ ఇప్పటికే నిర్ణయించింది. వెరసి ఒక్కో బాటిల్‌పై రూ.15 అదనపు దోపిడీ ఇకపై కూడా వర్తించనుందన్నది సుస్పష్టం.  

 

 

కూటమి ప్రజాప్రతినిధులకు మామూళ్లు
మద్యం సిండికేట్‌ డిమాండ్‌ను తమ ప్రభుత్వం ఆమోదించి ధరలు పెంచింది కాబట్టి.. తమకు మామూళ్లు ఇవ్వాల్సిందేనని టీడీపీ ప్రజా ప్రతినిధులు తేల్చి చెప్పారు. దీంతో సిండికేట్‌.. ఒక్కో మద్యం దుకాణం నుంచి రూ.50 వేలు, ఒక్కో బార్‌ నుంచి రూ.2 లక్షలు చొప్పున వసూలు చేసి కూటమి ప్రజా ప్రతినిధులకు ముట్టజెబుతోంది. ఆ ప్రకారం రాష్ట్రంలో 3,636 మద్యం దుకాణాల నుంచి రూ.18.18 కోట్లు, బార్ల నుంచి రూ.10.80 కోట్లు కూటమి ప్రజా ప్రతినిధులు వసూలు చేశారు. మద్యం దుకాణాల నుంచి సంక్రాంతి మామూళ్ల వసూళ్ల ప్రక్రియను కూటమి ప్రజా ప్రతినిధులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.  

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)