Breaking News

రెచ్చిపోయిన పచ్చమూక

Published on Tue, 04/30/2024 - 11:58

టీడీపీ శ్రేణుల రౌడీయిజం రోజురోజుకూ పెచ్చుమీరిపోతోంది. యథేచ్ఛగా దౌర్జన్యాలకు తెగబడుతోంది. బెదిరింపులతో వైఎస్సార్‌సీపీ నేతలను భయపెట్టాలని యతి్నస్తోంది. ఎన్నికల ప్రచారం సైతం సజావుగా సాగకుండా అడ్డుకునేందుకు పన్నాగాలు పన్నుతోంది. చివరకు పోలీసుల పహరాలో ఓట్టు అభ్యర్థించునే పరిస్థితిని కల్పిస్తోంది.  

కాణిపాకం: పూతలపట్టు మండలం వేపనపల్లె గ్రామంలో వైఎస్సార్‌సీపీ నేతలపై సోమవారం టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్‌కుమార్‌కు వస్తున్న ప్రజాదరణను ఓర్వలేక నానా రాద్ధాంతం సృష్టించారు.  బడా నాయకుల డైరక్షన్‌లో గొడవకు యత్నంచారు. తమ ఊర్లో వైఎస్సార్‌సీపీ ప్రచారం జరగకూడదని, ఓట్లు అడిగేందుకు వీలులేదంటూ రెచ్చిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు అధిక సంఖ్యలో గ్రామానికి చేరుకున్నారు. పక్క గ్రామంలో పర్యటిస్తున్న సునీల్‌కుమార్‌ వద్దకు వెళ్లి వేపనపల్లెలో ప్రచారం వాయిదా వేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రచారం చేసుకోవడం తన హక్కని ఆయన స్పష్టం చేయడంతో చేసేది లేక భద్రత కలి ్పంచారు. 

డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, సీఐ సుదర్శనప్రసాద్, విశ్వనాథరెడ్డి అక్కడి చేరుకుని పటిష్ట బందోబస్తుతో వేపనపల్లెలో ప్రచారం చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఉదయం 10.45 గంటలకు వేపనపల్లె గ్రామానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్‌కుమార్‌ తదతరులు చేరుకున్నారు. ఇంతలో అక్కడ గుమికూడిన టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా వైఎస్సార్‌సీపీ నేతలపైకి దూసుకొచ్చారు.  పచ్చిబూతులతో దూషించారు. పోలీసుల సమక్షంలోనే ఊర్లో అడుగుపెడితే నరికేస్తామంటూ బెదిరించారు. వీరికి జనసేన కార్యకర్తలు సైతం వంతపాడారు. మొత్తం వ్యవహారం గమనించిన పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

 పచ్చమూకకు గట్టిగా వారి్నంగ్‌ ఇచ్చారు. ఎన్నికల నియమావళి మేరకు అభ్యర్థుల ప్రచారం అడ్డుకుంటే కేసులు తప్పవని హెచ్చరించారు. ఎట్టకేలకు పోలీసుల పహరా నడుమ సునీల్‌కుమార్‌ గ్రామంలో ప్రచారం సాగించారు. అయినప్పటికీ  పచ్చబ్యాచ్‌ నినాదాలు చేస్తూ.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పోలీసులను సైతం లెక్క చేయకుండా గొడవకు కాలుదువ్వారు. అయితే వైఎస్సార్‌సీపీ ఎమ్మెలే9్య అభ్యర్థి ప్రచారాన్ని ప్రశాంతంగా ముగించారు. కాగా,  ఆరు నెలలకు కిత్రం ఆ గ్రామంలో నిర్వహించిన గడపగడప కార్యక్రమంలో గొడవ చోటుచేసుకుంది. అప్పుడు కూడా కొందరు ఇలానే ప్రవర్తించారు. అప్పుడు ఆరుగురిపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కక్షతోనే ఇప్పుడు మళ్లీ గొడవ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రజాస్వామ్య విరుద్ధం 
వేపనపల్లెగ్రామంలో జనసేన, టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్‌కుమార్‌ మండపడ్డారు. ఎన్నికల ప్రచారం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాళ్ల దాడి చేసినప్పుడే ఓపికతో వ్యవహరించామన్నారు. ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించుకుంటుంటే అడ్డగించడం కరెక్ట్‌ కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నామని వెల్లడించారు.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)